twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేశ్ సినిమా వల్లే దేశం మొత్తం ఇలాంటి పరిస్థితి వచ్చింది: జర్నలిస్ట్ సంచలన ట్వీట్‌

    |

    కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటార్ వాహన సవరణ చట్టం 2019 ప్రకారం చలాన్‌లు కాకపుట్టిస్తున్నాయి. నిబంధనలు పాటించని వాహనదారుల వీపు విమానం మోత మోగించే పనిలో పడ్డారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో చాలా మంది వాహనదారులు బుక్కై పోతున్నారు. ఒకేసారి భారీ మొత్తంలో జరిమానాలు పడడంతో ఎంతో మంది ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టు తెలుగు సినిమా ఇండస్ట్రీని నిందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. అది హాట్ టాపిక్ అవుతోంది.

    భారీ చలానాలు

    ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా మోటారు వాహనాల సవరణ బిల్లును రూపొందించారు. బిల్లు ఆమోదంతో గతంలో ఉన్న జరిమానాలను భారీగా పెంచారు. వాహనదారులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు రవాణాశాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే భారీ స్థాయిలో చలానాలు విధిస్తున్నారు.

    తెలుగు సినిమా ఇండస్ట్రీని నిందిస్తూ ట్వీట్

    తెలుగు సినిమా ఇండస్ట్రీని నిందిస్తూ ట్వీట్

    ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి తలెత్తడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీనే కారణం అని రాహుల్ రౌషన్ అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. అందులో మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను' హిందీ డబ్బింగ్ వర్షన్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఉంచాడు. అంతేకాదు, ‘ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న భారీ చలానాలకు తెలుగు సినిమా ఇండస్ట్రీనే నిందించాలి' అని పేర్కొన్నాడు. అయితే, ఇందులో అతడు తెలుగును సరిగా రాయకపోవడం గమనార్హం.

    హిందీలో డబ్బింగ్

    హిందీలో డబ్బింగ్

    తెలుగులో ఘన విజయం సాధించిన ‘భరత్ అనే నేను' సినిమాను హిందీలో ‘డాషింగ్ సీఎం భరత్' అనే పేరుతో డబ్బింగ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా యూట్యూబ్‌లో 62 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే, దాదాపు నాలుగు లక్షలు లైకులను కూడా అందుకుంది.

     మహేశ్ బాబు సినిమాలో..

    మహేశ్ బాబు సినిమాలో..

    మహేశ్ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘భరత్ అనే నేను' సినిమాలో ట్రాఫిక్ రూల్స్‌కు సంబంధించిన ఓ సీన్ ఉంటుంది. ఇందులో మహేశ్ బాబు సీఎంగా సంచలన నిర్ణయం తీసుకుంటాడు. దీని ప్రకారం.. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై భారీ స్థాయిలో జరిమానాలు విధించమని చెబుతాడు. ఈ సీన్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

    గతంలో ‘బిచ్చగాడు'లో కూడా..

    గతంలో ‘బిచ్చగాడు'లో కూడా..

    ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం గతంలో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దాని కంటే ముందే ఈ పరిస్థితిని ‘బిచ్చగాడు' అనే సినిమాలో చూపించారు. దీంతో అప్పట్లో ఈ సినిమా కూడా బాగా చర్చనీయాంశం అయింది.

    English summary
    Bharat, a graduate from Oxford, is forced to take up his father's position as the chief minister after his sudden death. He tries to reform the corrupt society but faces obstacles from his enemies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X