టెలిఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

సినీ పరిశ్రమలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం సృష్టిస్తున్నది. పలువురు సినీ హీరో, హీరోయిన్ల ఫోన్ కాల్స్‌ను గత ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయం బయటకు రాగానే ప్రస్తుతం సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడిన తెలంగాణ ప్రభుత్వ అధికారి ప్రణీత్ రావు అరెస్ట్, విచారణ తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేశారనే వార్త అందర్నీ ఎక్కువగా ఆకర్షించింది. అయితే ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ స్టార్ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ హీరో ఎవరా? అనే ఆసక్తి అందరిలోను పెరిగింది. అయితే తన భర్తకు విడాకులు ఇవ్వడానికి టెలిఫోన్ ట్యాపింగ్ ఓ కారణం అనే విషయం ఈ వివాదంలో అటెన్షన్ క్రియేట్ చేసింది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆ అంశం మరింత క్యూరియాసిటిని క్రియేట్ చేసింది.

Journalist Teenmar Mallana reveals reason behind Samantha Ruth Prabhu and Naga Chaitanya Divorce

ఇక కవిత అరెస్ట్ నేపథ్యంలో ఓ వీడియోలో యూట్యూబర్, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత రుత్ ప్రభు, నాగచైతన్య అక్కినేని విడిపోవడానికి కూడా టెలిఫోన్ ట్యాపింగే కారణమని ఓ వార్త వినిపిస్తున్నది. ఆ ఇద్దరు సెలబ్రిటీల మధ్య అప్పటి అధికార పార్టీలోని కీలక నేత, మందులు ఇచ్చే వ్యక్తి జోక్యం వల్లే విడాకులు తీసుకొన్నారని తెలుస్తున్నది. ఇంకా వాస్తవాలు తెలుసుకొని దానిపై మరింత వివరంగా వీడియో చేస్తాను అని తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ ఎవరు? అనే విషయంపై కొనసాగిన సందిగ్ధతకు తీన్మార్ మల్లన్న తెర దించారు. అయితే నిజంగానే సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం టెలిఫోన్ ట్యాపింగేనా? లేదా వారిద్దరి మధ్య అభిప్రాయబేధాలా? అనే మరింత ఆసక్తిని రేపుతున్నది.

ఇదిలా ఉండగా, ఇప్పటికే సమంత, నాగచైతన్య విడాకుల వార్త తెరమరుగైంది. అంతా వారిద్దరి దాంపత్య జీవితం గురించి మరిచిపోయిన నేపథ్యంలో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వారి జీవితం గురించిన విషయాలను మీడియాలో హైలెట్ అయ్యేలా చేశాయి. అయితే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజంగా సమంత జీవితంలో చిచ్చు పెట్టిందా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే.. తీన్మార్ మల్లన్న వెల్లడించే వీడియోనే క్లారిటీ ఇచ్చేలా కనిపిస్తున్నది.

ఇదిలా ఉండగా, తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు, హీరోల ఫోన్లపై నిఘా పెట్టి వారిని వేధించినట్టు, బ్లాక్ మెయిల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎంత నిజం ఉంది. ఎంత మేరకు వాస్తవాలు ఉన్నాయనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించే వివరాలు ఈ అనుమానాలను పటాపంచలు చేస్తుందని సినీ, మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X