ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి నగ్నంగా. అప్పుడు జరిగింది ఇదే : నిజాలు బయటపెట్టిన టీవీ5 మూర్తి

సినీనటి కాకపోయినా సెలబ్రెటీ స్టేటస్ అనుభవిస్తోంది శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో ఆమె పేరు మారుమోగిపోయింది. తెలుగు చిత్ర సీమలోని పెద్ద పెద్ద స్టార్లపై మీడియాకెక్కి, నానాయాగీ చేసింది శ్రీరెడ్డి. పరుష పదజాలంతో , వాడి వేడి విమర్శలు చేసే ఆమెకు అప్పట్లో ఫాలోవర్లు కూడా బాగా వుండేవారు.

తనను అవకాశాల పేరుతో పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు వాడుకున్నారని తెలుగు అమ్మాయిని కావడం వల్లే తనకు ఛాన్స్‌లు ఇవ్వడం లేదంటూ వాపోయింది. తననే కాకుండా ఎంతో మంది తెలుగు అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని , కోరిక తీర్చకుంటే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే కొందరికి సంబంధించిన వివరాలను శ్రీరెడ్డి లీక్స్ పేరిట సోషల్ మీడియాలో విడుదల చేసి సంచలనం రేపింది.

Journalist TV5 Murthy Given Clarity About Sri Reddy s protest on casting couch

అన్నింటికి మించి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఫిలిం ఛాంబర్ కార్యాలయం వద్ద ఆవిడ చేసిన హడావుడి హాట్ టాపిక్ అయి కూర్చొంది. తనకు న్యాయం చేయకుంటే ఫిల్మ్ ఛాంబర్ వద్ద బట్టలు విప్పి నగ్నంగా నిరసన తెలియజేస్తానంటూ ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో హెచ్చరించింది. అన్నట్లుగానే బట్టలను తీసేసి నిక్కర్‌తోటే కూర్చొని నిరసన తెలిపింది. వెంటనే అప్రమత్తమైన ఛాంబర్ సభ్యులు శ్రీరెడ్డితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినా, ఆమె ససేమిరా అనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

కాగా.. శ్రీరెడ్డి ఇలా రెచ్చిపోవడానికి ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 మూర్తే కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఏం జరిగిందో ఆయన వివరించే ప్రయత్నం చేశారు. శ్రీరెడ్డిని లైవ్ షోకు పిలిచానని, ఈ సందర్భంగా ఏం జరిగిందో చెప్పడంతో పాటు వాళ్ల సంగతి తేలుస్తానంటూ ఆమె ఊగిపోయిందన్నారు. దీంతో తాను, మరో సినీనటి కరాటే కళ్యాణీ ఆమెను మందలించామని మూర్తి గుర్తుచేశారు.

Journalist TV5 Murthy Given Clarity About Sri Reddy s protest on casting couch

శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ముందు నిరసన ప్రదర్శన చేసిన రోజున తాను హైదరాబాద్‌లోనే లేనని, తన తల్లికి అనారోగ్యంగా వుంటే ఆసుపత్రిలో ఆమె పక్కనే వున్నానని మూర్తి తెలిపారు. సొంతూరి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత శ్రీరెడ్డి ఇష్యూ గురించి తెలిసిందని, ఈ గొడవకు తానే కారణమంటూ కొందరు ఆరోపణలు చేశానని ఆయన వెల్లడించారు. అయితే శ్రీరెడ్డి చెప్పిన క్యాస్టింగ్ కౌచ్‌ ఉద్యమానికే తాను మద్ధతుగా నిలిచానని, అంతే తప్పించి ఆమె చేసిన నిరసనకు కాదని మూర్తి తేల్చిచెప్పారు. అప్పటికీ , ఇప్పటికీ క్యాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమానికి తన మద్ధతు వుంటుందని టీవీ5 మూర్తి క్లారిటీ ఇచ్చారు.

తాను సామాజిక బాధ్యతగా క్యాస్టింగ్ కౌచ్‌ ఉద్యమానికి మద్ధతు ఇచ్చానని.. కానీ కొంతమంది వ్యక్తులు దీనిని తప్పుదోవ పట్టించారని ఆయన స్పష్టం చేశారు. ఒక ఉద్యమం ప్రారంభమైన తర్వాత అది ఎక్కడికి, ఎటువైపుకు పోతుందో ఎవరి చేతుల్లోనూ వుండదని టీవీ5 మూర్తి స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X