సినిమాలో తమని తాగుబోతులుగా చూపెట్టారంటూ జర్నలిస్టుల కేసు

By Srikanya

తాము త్రాగుతామని, బూతులు మాట్లాడతామని చిత్రంలో చూపెట్టడం ఎంతవరకూ భావ్యం, ఇది తమను కించపరిచినట్లేనంటున్నారు జర్నలిస్టులు. రీసెంట్ గా రిలీజైన నో వన్ కిల్డ్ జెస్సికా చిత్రంలో రాణీ ముఖర్జి జర్నలిస్ట్‌గా నటించారు. ఈ పాత్ర కోపం వచ్చినప్పుడు ఆ ఎమోషన్లో బూతులు కూడా మాట్లాడుతుంది. ఈ విషయం పట్ల కొంతమంది జర్నలిస్ట్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అలాగే ఆమె ఓ చోట మద్యం తీసుకుంటుంది. ఇలా సినిమాలో రాణి బూతులు మాట్లాడటం, మద్యం పుచ్చుకోవడం జర్నలిస్టులను కించపరిచినట్లేనని, జర్నలిస్టులు ఈ విధంగానే ఉంటారనే అభిప్రాయాన్ని ఏర్పరుస్తోందని, అందుకని రాణిపై చర్య తీసుకోవాలని కేసు పెట్టారు.

ఈ చిత్రానికి రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఆయనపై కూడా కేసు నమోదు అయ్యింది. ఈ సినిమాలో విద్యాబాలన్ కూడా నటించారు.ఇక ఈ చిత్రం 1999 సంవత్సరం ఏప్రిల్ 29న ఢల్లీ నగర శివారుల్లోని ఓ రిచ్ పబ్ లోని ఓ హత్య ఆధారంగా తీయబడింది. ఆ పబ్‌లో జరుగుతున్న సోషలైట్ సెలిబ్రిటీ పార్టీకి హర్యానా మంత్రి వినోద్‌శర్మ కుమారుడు మనుశర్మ వచ్చాడు. ఆ బార్‌లో బార్ టెండర్‌గా పనిచేస్తున్న మోడల్-జెస్సికాలాల్! మను అప్పటికే పీకలవరకు తాగాడు. మరో పెగ్ అడిగాడు. జెస్సికా వారించింది. మను తన దగ్గరున్న రివాల్వర్ తీసి జెస్సికాని కాల్చాడు. జెస్సికా అక్కడికక్కడే మరణించింది.అదే ఇతివృత్తంతో ఈ చిత్రం తీసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X