కథ లేకున్నా..విషయం ఉన్న ‘జర్నీ’ (రేపు విడుదల)
గజనీ, సెవెన్త్ సెన్స్ చిత్రాలను రూపొందిన మురగాస్ నిర్మించిన సినిమా జర్నీ. ఈ సినిమా రేపు(డిసెంబర్ 16)న విడుదల కాబోతోంది. తమిళంలో 'ఎంగేయుమ్ ఎప్పొదుమ్' పేరుతో రూపొందిన ఈ సినిమా అక్కడ త్వరలో వందరోజులు పూర్తిచేసుకోబోతుంది. ఈ చిత్రాన్ని యస్.కె.పిక్చర్స్ పతాకంపై నిర్మాత సురేష్ కొండేటి 'జర్నీ' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సినిమా గురించి విషయాలను ఆ చిత్ర హీరో శర్వానంద్ వివరిస్తూ...''మనం రోజువారి జీవితంలో ఎన్నో ప్రమాద వార్తల్ని వింటుంటాం. కానీ ఆ ప్రమాదాల వెనక వున్న కారణాలు...అవి జీవితాలపై ఎలాంటి పరిణామాల్ని చూపుతాయో ఎప్పుడూ ఆలోచించం. అలాంటి అంశాలన్నింటినీ హృద్యంగా చర్చిస్తుందీ చిత్రం. ఇందులో కథగా ఏమీ వుండదు. రెండు ప్రేమ జంటల భావోద్వేగభరిత ప్రయాణమిది. నాయకానాయికలకు మాత్రమే కాకుండా ప్రతీ పాత్రకు ప్రాధాన్యత వుంటుంది. ప్రతి సన్నివేశం యథార్థానికి దగ్గరగా చాలా సహజంగా వుంటుంది'' అచి చెప్పారు. నాలుగు పాటలు, రెండు ఫైట్లతో సినిమా చేయడం నాకు ఇష్టం వుండదు. సినిమాలో నా పాత్ర కంటే మొత్తంగా సినిమా కథేంటనే విషయానికే నేను ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాని శర్వానంద్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











