రిలీజ్ అవటానికి నలభయ్యేళ్లు పట్టింది

By Srikanya

 Love In Bombay
ముంబై : షూటింగ్ ప్రారంభమైన నలభయ్యేళ్ల తరవాత ఓ సినిమా తెరపైకి వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హిందీ నటుడు, దర్శకుడు జాయ్‌ ముఖర్జీ నటిస్తూ రూపొందించిన 'లవ్‌ ఇన్‌ బాంబే'ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జాయ్‌ నాలుగు దశాబ్దాల కిందట ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో అశోక్‌కుమార్‌, కిషోర్‌ కుమార్‌, వహీదా రెహమాన్‌ నటించారు. అప్పట్లో ఈ సినిమా ఎందుకు విడుదల కాలేదనేది ఇప్పటికీ అంతుబట్టని విషయంగానే మిగిలిపోయింది. జాయ్‌ పెద్ద కొడుకు మోనో జాయ్‌ ముఖర్జీ 'లవ్‌ ఇన్‌ బాంబే'ని విడుదల చేసేందుకు నడుం బిగించారు.

మోనో జాయ్‌ ముఖర్జీ మాట్లాడుతూ ''ఈ సినిమాను ఎందుకు విడుదల చేయలేకపోయారో నాక్కూడా తెలియదు. మా నాన్న ఆ విషయం తనలోనే దాచుకున్నారు. ఎవరికీ చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే '80ల్లో ఒకసారి, '90ల్లో మరోసారి ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నించారు. 2011లో శాటిలైట్‌ ద్వారా విడుదల చేద్దామని నేను సలహా ఇచ్చాను. కానీ కార్యరూపం దాల్చలేదు. నెగెటివ్‌ ఎక్కడుందో రెండు నెలలపాటు ప్రయత్నిస్తేగానీ ఆచూకీ దొరకలేదు. అయితే నెగెటివ్‌ పాడు కాకుండా వూండటం ఆనందాన్నిచ్చింది'' అన్నారు.

ఈ సినిమాకు శంకర్‌-జైకిషన్‌ స్వరాలు అందించారు. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన పాటల్ని విడుదల చేశారు. త్వరలోనే నాటి 'లవ్‌ ఇన్‌ బాంబే'ని తెరపైకి తెస్తారు. మరి ఏ విధంగా ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X