రామ్ చరణ్ తో ఒకేఒక్క ఛాన్స్ ప్లీస్: జూ అనుష్క ...!?
'అరుంధతి" చిత్రంలో జూనియర్ అనుష్కలా నటించిన దివ్య, ఇటీవలే 'నేను నాన్న అబద్దం" చిత్రంతో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి స్పందనను సంపాదించుకుంటుంది. అలాగే తెలుగు, తమిళంలో హీరోయిన్ గా అవకాశాలొస్తున్నాయి. అయితే ఆమెకు తగ్గ పెద్ద క్రేజీ ఆఫర్స్ ఏవీ రాలేదంట. ఏవో చిన్నా చితకా సినిమాల్తో నెట్టుకొచ్చేస్తోంది. ఇదంతా హీరోయిన్ గా కాన్ఫిడెన్స్ ఏర్పడడం కోసం చేస్తున్నదని, మున్ముందు స్టార్ హీరోలతో నటించాలని అనుకుంటున్నానని, రామ్ చరణ్, అల్లు అర్జుణ్ తదితర యువ హీరోలతో నటించే అవకాశమొస్తే వదులుకోనని చెప్తోంది.
అయితే ఒక్క చిత్రం విజయం సాధించిన, తను ఒక టాప్ హీరోయిన్ అని ఫీల్ అవుతున్న దివ్వ...చరణ్ తో హీరోయిన్ గా ఒక్క సినిమాలోనైనా నటించాలనే కోరికతో చాలా దృడంగా ఉందట. అందుకు కారణం మగధీరలో చరణ్ విన్యాసాల గురించి దివ్వ మురిసిపోతూ చెప్పడం చూస్తే, పరభాషా నటులని బ్యాన్ చేయడానికి కృషి చేస్తున్న చరణ్ దృష్టిలో పడేందుకు దివ్య బాగా కలిగా ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. అయినా ఈ మగధీర కోసం చాలా మంది క్యూ కట్టారు. ఈ జూనియర్ అరుంధతికి అంతా సీన్ లేదని అనిపిస్తుంది. అంటే దివ్య కోరిక తీరుతుందో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











