Don't Miss!
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆగని వ్యభిచార దందా: ఇపుడు స్వాతి, గతంలో వీరు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మరో నటి వ్యభిచార భాగోతం బట్టబయలైంది. హైదరాబాద్ లోని మోతీ నగర్ ఏరియలో పట్టుబడ్డ హైటెక్ సెక్స్ రాకెట్లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన జూ ఆర్టిస్ట్, టీవీ నటి అయిన స్వాతి అరెస్టయింది. ఆమెతో పాటు మరికొందరిని ఎస్ఆర్ నగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఈ సెక్స్ రాకెట్ గురించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
అందమైన రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగం చూడటానికి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి రంగంలోనూ ఉన్నట్లే సినిమా రంగంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. కారణాలు ఏమైనా కానివ్వండి....పలువురు తారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సినిమా ఇండస్ట్రీ కీర్తిని మసకబారేలా చేస్తోంది.
అవకాశాలు తగ్గిపోయిన పలువురు హీరోయిన్లు, కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారు....ఈజీ మనీకోసం ఇలాంటి అడ్డదారిలో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి సంఘటనల కారణంగా నటనను కెరీర్ ఎంచుకునే మహిళలకు సమాజంలో ఇబ్బంది కర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఇప్పటి వరకు సీనియర్ నటి కిన్నెర, యమునలతో పాటు భువనేశ్వరి, సైరా భాను, జ్యోతిలతో పాటు 'లయ', 'హిమబిందు' వంటి టీవి సీరియళ్లలో నటించిన టీవీ నటి శ్రావణి తదితరులు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నారు. గత కొన్ని రోజుల క్రితం బెంగాళీ టీవీ నటి సుకన్య చటర్జీ పోలీసులకు హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో హోటల్‌లో పట్టుబడింది. కొన్ని రోజుల క్రితం ఓ యువ హీరోయిన్ కూడా ఇలాంటి కేసులో అరెస్టయింది. పోలీసులు వీటిని అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత మందిని అరెస్టు చేసినా మళ్లీ మళ్లీ ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
యమున
సినీనటి యమున వ్యభిచారం నిర్వహిస్తూ అప్పట్లో పోలీసులకు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరులోని ఐటీసీ గార్డెన్ హోటల్లో యమునతోపాటు మరో తొమ్మిదిమంది వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. "మౌనపోరాటం" చిత్రంతో తెలుగుతెరపై గుర్తింపు తెచ్చుకున్న యమున తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతోపాటు బుల్లితెరపై అనేక సీరియళ్లలో నటించింది.
భువనేశ్వరి
సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో నటించిన నటి భువనేశ్వరి కూడా ఆ మధ్య వ్యభిచారం చేస్తూ పట్టుడిన సంగతి తెలిసిందే. పట్టబడిన భువనేశ్వరి తాను మాత్రమే కాదు...చాలా మంది స్టార్స్ ఇదే పని చేస్తున్నారని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది.
కిన్నెర
చెట్టు క్రింద ప్లీడర్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి, టీవీ సీరియల్స్ లో ఒక వెలుగు వెలిగిన కిన్నెర నిన్న శనివారం టీవీ 9 ఛానెల్ చేసిన ఓ స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయింది. సినిమా ఛాన్సులు కోసం వచ్చే అమ్మాయిలను నిర్మాతలు,ఫైనాన్సియర్స్ కు ఎర వేసి డబ్బు సంపాదించటంలో ఆరి తేరిందని రుజువైంది.
సైరాభాను, జ్యోతి
తెలుగు నటీమణులు సైరా భాను, జ్యోతి అప్పట్లో వ్యబిచారం చేస్తూ పట్టుబడ్డారు. అప్పట్లో వీరి వ్యవహారం తెలుగు మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాము వ్యభిచారం చేశామని తెలుగు సినీ తారలు సైరాబాను, జ్యోతి అంగీకరించినట్లు, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వారు తమ నేరాలను అంగీకరించినట్లు ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్స్ అప్పట్లో వార్తాకథనాన్ని ప్రసారం చేసాయి.
టీవీ నటి శ్రావణి
ఐటీ కంపెనీలకు కేంద్రమైన మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ ప్రాంతంలో హైటెక్ పద్ధతుల్లో సాగుతున్న వ్యభిచార కూపాన్ని ఎస్‌వోటీ(స్పెషల్ ఆపరేషన్‌స టీమ్) పోలీసులు కొన్ని రోజుల క్రితం రట్టుచేశారు. ‘లయ', ‘హిమబిందు' వంటి టీవి సీరియళ్లలో నటించిన శ్రావణితోపాటు ఓ పారిశ్రామికవేత్త పోలీసులకు దొరికిపోయారు.
బెంగాళీ టీవీ నటి సుకన్య
ఇటీవల బెంగాళీ టీవీ నటి సుకన్య చటర్జీ హైదరాబాద్ లోని దసపల్లా స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.
శ్వేతా బసు ప్రసాద్
తెలుగు నటి శ్వేతా బసు ప్రసాద్ కూడా ఇటీవల ఇలాంటి ఆరోపణలతో అరెస్టయిన సంగతి తెలిసిందే.