»   » ఊపిరి ఆగుతుందన్న ఎన్టీఆర్, అమ్మమ్మలా ఉందన్న వర్మ...

ఊపిరి ఆగుతుందన్న ఎన్టీఆర్, అమ్మమ్మలా ఉందన్న వర్మ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ట్రైలర్ రిలీజైంది.

ట్రైలర్‌ చూసి పలువురు సెలబ్రిటీలు స్పందించారు. జూ ఎన్టీఆర్, రామ్ గోపాల్ వర్మ సహా పలువురు సెలబ్రిటీలు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు.


ఊపిరి ఆగిపోతుందన్న ఎన్టీఆర్

ట్రైలర్ చూసిన హీరో జూ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...."ఇప్పటివరకు చూడని అనుభవం. ఈ ట్రైలర్ చూస్తుంటే మీ నాడి వేగం పెరిగిపోతుంది. ఊపిరి ఆగిపోతుంది. కను రెప్పను కూడా వేయాలనిపించదు. జక్కన్నా దిగ్రేట్" అంటూ తారక్ ట్వీట్ చేశాడు.


అమ్మమ్మలా ఉందన్న వర్మ

బాహుబలి-2 ట్రైలర్ చూసిన వర్మ.... ఈ ట్రైలర్ ట్రైలర్లకు అమ్మలా కాదు, అమ్మమ్మలా ఉంది. రాజమౌళికి మెగా బాహుబలియన్ సెల్యూట్ అంటూ వర్మ ట్వీట్ చేసారు.


కళ్యాణ్ రామ్

బాహుబలి-2 ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఉంది..ప్రభాస్, రానా, రాజమౌళి మరియు టీంకు కంగ్రాట్స్ అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేసారు.


అల్లరి నరేష్

బాహుబలి-2 ట్రైలర్ చూసిన అల్లరి నరేష్ స్పందిస్తూ.... ట్రైలర్ నిజంగా కింగ్ సైజ్ లా ఉంది. జీనియస్ డైరెక్టర్ రాజమౌళికి హాట్సాఫ్. టీం మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసారు.


rn

ట్రైలర్

బాహుబలి 2. రెండవ భాగం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ఒకేసారి విడుదల అవ్వనుంది. మొదటి భాగం 2015 జులై 10 న విడుదల అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.


English summary
"An experience unlike any other.your pulse races your breath stops and you can't stop staring.kudos Jakkana ssrajamouli #Baahubali2trailer" NTR tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu