లవర్ బాయ్ అనుకొన్నారా?కాదు మాస్ రచ్చ రచ్చే...జూ ఎన్టీఆర్
కొంతమంది ఇష్టంతో నటిస్తారు..కొంతమంది ప్రేమతో నటిస్తారు. ఎన్టీఆర్ మాత్రం కసితో నటిస్తారు. మొండి పట్టుదలతో ఎలాంటి పాత్రనైనా మెడలు వంచి లొంగదీసుకొంటారు. లేకపోతే యముడిగా పేజీల కొద్దీ సంభాషణల్ని అలవోకగా చెప్పెయ్యడమేంటి?అంతే కాదు నాట్యం, అభినయం, ఆహార్యం వీటిన్నింటి మీదా అతను అంత సాధికారికత సాధించేయడమేంటి? ఓ లెక్క ఉంది జూ ఎన్టీఆర్ రెండు సూత్రాల్ని తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకొంటారు. ఒకటి కొత్తదారిలో వెళ్లాలి..రెండు ఇమేజ్ మరచిపోకూడదు. 'బృందావనం" ఆ సూత్రాల మేళవింపే అని చెబుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ నెట 14న రిలీజ్ అవుతున్న 'బృందావనం" విశేషాతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలు మీ కోసం...
బృందావనంలో గోవిందుడు ఎంత అల్లరివాడో తెలిసిందే కదా! తెర మీద కూడా అలాగే ఉంటాడు. నా తరహా సన్నివేశాలు చాలానే ఉంటాయి. 'పట్నం నుంచి వచ్చాడు లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనురోకండి..క్యాకెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా.. లోపల మాస్ అలాగే ఉంది..వాడు బయటకు వచ్చాడో రచ్చ రచ్చే.." అనే డైలాగుతోనే నా పాత్ర స్వభావం తెలిసిపోతుంది. నవరసభరితమైన కథ ఇది. దర్శకుడు వంశీ తెరకెక్కించిన తీరు అందరికీ నచ్చుతుంది నిర్మాత దిల్ రాజు కూడా ఎంతో ఇష్టంతో ఈ ప్రాజెక్ట్ ని తీర్చి దిద్దారు.


Click it and Unblock the Notifications











