ఈ 31 రాత్రి జూ ఎన్టీఆర్ ఎక్కడంటే...
హైదరాబాద్ : 2013 వెళ్లిపోయి...రేపు కొత్త సంవత్సరం వస్తోంది. ఈ నేపధ్యంలో తను ఈ రాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాడో ఎన్టీఆర్ మీడియాకు తెలియచేసారు. అయితే ఎక్కడ జరుపుకుంటానో ఇప్పటికీ తెలియదన్నారు. అలాగే కొత్త సంవత్సరం తనకు బాగా కలిసి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.... ''31 రాత్రి సంతోష్ శ్రీనివాస్ సినిమా షూటింగ్‌లో ఉంటానేమో..? ఒకవేళ సెలవు ఇస్తే (నవ్వుతూ) ఇంటి దగ్గరే సంబరాలు. 'బాద్‌షా' అభిమానులకు బాగా నచ్చింది. అందులో నేను కొత్తగా కనిపించాను. 'రామయ్యా వస్తావయ్యా'లో అయితే నా వయసు మరీ తగ్గిపోయింది. నా లుక్.. నాకే కొత్తగా అనిపించింది. 2014లో ఎప్పట్లా అభిమానుల్ని అలరించాలనే ధ్యేయంతోనే శ్రమిస్తా'' అన్నారు.
ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 2013 వేసవికి 'బాద్‌షా'గా వచ్చారు. తర్వాత 'రామయ్యా వస్తావయ్యా' గా వచ్చి అలరించలేకపోయారు. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్‌తో ఓ చిత్రం సెట్స్ ఉంది. సుకుమార్ ప్రస్తుతం మహేష్‌బాబుతో '1' చిత్రం ఫైనల్ టచ్ స్ లో ఉన్నారు. ఇవి పూర్తయ్యాకే ఈ కొత్త కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా కొత్త తరహాలో యూత్ ని ఆకట్టుకునేలా ఉంటుందని చెప్తున్నారు.
'అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2014 సమ్మర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రిలియన్స్ వారు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహిస్తారు. గత మూడు చిత్రాలుగా బి.వియస్ ఎన్ ప్రసాద్ అశోశియేషన్ లో ఉన్న రిలియన్స్ వారు..ఈ సినిమాతో మళ్లీ తమ అశోశియేషన్ ని ఎక్సటెండ్ చేసారు.


Click it and Unblock the Notifications












