'అదుర్స్' చిత్రం గోరుముద్దలాంటిది: ఎన్టీఆర్
పసి పాపాయికి అమ్మ పెట్టే గోరుముద్ద కమ్మగా ఉంటుంది. అలాగే నాకు 'అదుర్స్' సినిమా గోరుముద్దలాంటిది. ప్రమాదం తర్వాత నాకు దేవుడిచ్చిన వరం. దేవుడి రుణాన్ని తీర్చుకోలేరంటారు. నేను ఆయనకు ఏం చేయగలుగుతానో తెలియట్లేదు'' అన్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా నటించిన 'అదుర్స్' సంక్రాంతికి విడుదలైంది. ఈ చిత్రం ప్రమేషన్ లో భాగంగా ఆయన మీడియాను కలిసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ''ప్రమాదం జరిగినప్పుడు.. ఇక అమ్మను, నా శ్రేయోభిలాషులను చూస్తానో లేదో అనిపించింది. జీవితంలో ఏదో చేయాలన్న కోరిక చిన్న వెలుగై కనిపించింది. అదే నన్ను బతికించింది. 'అదుర్స్' విజయం కావడంతో మా అందరి ఆనందానికి అవధుల్లేవు. నా కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. మా సమష్టి కృషి ఫలితమే అదుర్స్. అలాగే స్టూడెంట్ నెం.1, ఆది, సింహాద్రి... ఇవన్నీ గత జన్మలో వచ్చిన విజయాలు అనిపిస్తున్నాయి. పునర్జన్మ తరవాత దక్కిన విజయంగా 'అదుర్స్' ఉందిసినిమా'' అని పేర్కొన్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వల్లభనేని వంశీమోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని కొడాలి నాని సమర్పించారు. నయనతార, షీలా హీరోయిన్స్ గా నటించారు. మహేష్ ముంజ్రేకర్ విలన్ గా చేసారు. బ్రహ్మానందం కామిడీ చిత్రానికి ఆయువుపట్టులా నిలిచింది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తూ వేరియేషన్స్ చూపటం ఆయన ఫ్యాన్స్ కు బాగా నచ్చుతోంది. కోన వెంకట్ కథ,మాటలు అందించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











