twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భయంకరమైన కరోనాకు వ్యాక్సిన్ ఉంది గానీ.. దానికి వ్యాక్సిన్ లేదు.. ఎన్టీఆర్ ఎమోషనల్

    |

    జాతీయ రోడ్డు భధ్రతా ఉత్సవాలు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షిక సదస్సుకు హాజరైన ఎన్టీఆర్ ఎమోషనల్‌గా మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో అనే విషయాన్ని తన కుటుంబంలో జరిగిన యాక్సిండెట్‌లను ఈ సందర్భంగా గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ...

    Recommended Video

    Jr NTR : రోడ్డు ప్రమాదాలపై Young Tiger NTR ఆవేదన !
     మా కుటుంబంలో రెండు విషాదాలు

    మా కుటుంబంలో రెండు విషాదాలు

    రోడ్డు ప్రమాదాలు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాయి. మా అన్నయ్య జానకీరాం, తండ్రి హరికృష్ణ మరణం మాకు తీరని బాధలను తెచ్చిపెట్టింది. అందుకే నేను ప్రతీసారి, అవకాశం దక్కిన ప్రతీరోజు రోడ్డుపై ప్రయాణించటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఇంటి సభ్యులు మనకోసం వేచి చూస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని ఎన్టీఆర్ చెప్పారు.

    కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. కానీ

    కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. కానీ

    భయంకరమైన కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఉంది. కానీ ఇలాంటి రోడ్డు ప్రమాదంలో గురయ్యే బాధితులకు వ్యాక్సిన్స్ లేవు. అందుకే మనమే బాధ్యతగా వ్యవహరించాలి. మనల్ని మనం సన్మార్గంలో పెట్టుకోవాలి. ఈ వేదిక నుంచి అందరిని కోరేది ఒకటే. మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీ కుటుంబ సభ్యుల కోసం మీరే మారాలి అని ఎన్టీఆర్ సూచించారు.

     దేవుడు అన్ని చోట్ల ఉండడు..

    దేవుడు అన్ని చోట్ల ఉండడు..

    దేవుడు అన్ని చోట్ల ఉండేలేరు కాబట్టి తల్లిదండ్రులను సృష్టించారు. తల్లిదండ్రులు అన్ని చోట్ల ఉండలేరు కాబట్టి గురువులను సృష్టించారు. మన దేశాన్ని రక్షణ కల్పించే సైనికులు, మన ఇంటి ముందు పహారా కాసే పోలీసులను దేవుడు సృష్టించాడు. వారి సేవలను మనం గుర్తుంచుకోవాలి. వారికి గౌరవం ఇవ్వాలి అంటూ ఎన్టీఆర్ సూచించారు.

     పోలీస్ చేతిలో లాఠీకి గౌరవం ఇవ్వాలి

    పోలీస్ చేతిలో లాఠీకి గౌరవం ఇవ్వాలి

    గురువు చేతిలో లాఠీ ఉండదు కానీ పోలీస్ చేతిలో లాఠీ ఉంటుంది. వారు మనల్ని దండించడానికి కాదు. మనల్ని సన్మార్గంలో నడిపించడానికి వారి చేతిలో లాఠీ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పోలీసులకు అన్ని విషయాల్లో సహకరిద్దాం అంటూ ఎన్టీఆర్ సలహా ఇచ్చారు.

    English summary
    Jr NTR gets emotional at Cyberabad Traffic Police Annual Conference over father Harikrishna and brother Janaki Ram Death. He attended a conference as Cheif guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X