ఇది స్క్రిప్ట్‌డ్ షో కాదు.. ఇందులో అది కుదురదు.. ఎవరు మీలో కోటీశ్వరుడుపై ఎన్టీఆర్
ఎన్టీఆర్ ప్రస్తుతం బుల్లితెర మీద రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ రచ్చ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ షోకు సంబంధించిన విషయాలను చెప్పేందుకు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. తన సినిమాలు, షోకు సంబంధించిన వివరాలను తెలిపాడు. ఈ షోకు హోస్ట్ చేసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడో కూడా చెప్పుకొచ్చాడు.

బుల్లితెరపై మరోసారి..
ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపించబోతోన్నాడని వార్తలు రాగానే రచ్చ రచ్చగా మారింది. రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో ఇచ్చుకుంటున్నారని, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ప్రోమోలను షూట్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. మొత్తానికి ఇప్పుడు వచ్చిన ప్రోమో, షోపై ఎన్టీఆర్ చేసిన కామెంట్లు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి.

ముందు ఒకటి అవ్వనివ్వండి..
ఎవరు మీలో కోటీశ్వరుడు సీజన్స్ గురించి మాట్లాడుతూ ఓ మీడియా ప్రతినిథి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అన్ని సీజన్లకు మీరే హోస్ట్‌గా ఉంటారా? అని అడిగితే ఎన్టీఆర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ముందు ఒకటి అవ్వనివ్వండి.. ఆ తరువాత మీరే వద్దాంటారో.. నేనే వద్దనుకుంటానో.. లేదో జెమినీ యాజమాన్యమే వద్దనుకుంటుందో ఎవరికి తెలుసంటూ చెప్పుకొచ్చాడు.

ఊహాలోకం..
సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండరెందుకు అనే ప్రశ్నకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. అదో ఊహా ప్రపంచం అలాంటి వాటిలో ఉంటూ నేను ఏదో గొప్ప అని అనుకోవడం నాకు నచ్చదు.. నాకు నా ప్రపంచం ఉంది.. ఇద్దరు పిల్లలు, స్నేహితులు ఇలా వారితో ఉంటే నాకు చాలనిపిస్తుందంటూ చెప్పుకొచ్చాడు.

స్క్రిప్ట్‌డ్ షో కాదు..
ఇక ఇది స్క్రిప్ట్‌డ్ షో కాదు.. ముందే అంతా ప్లాన్ చేసుకుని మాట్లాడటానికి.. ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం.. దాన్ని స్క్రిప్ట్‌గా చేయడం కుదరదు.. ఈ షోకు ఫార్మాట్ ఉంటుంది.. కానీ స్క్రిప్ట్ ఉండదంటూ ఎన్టీఆర్ అన్ని అనుమానాలు క్లియర్ చేసేశాడు.

రాజకీయాలపైనా..
ఇక ఇదే మీడియా ఇంటరాక్షన్‌లో భాగంగా రాజకీయ ప్రవేశం గురించి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురుయ్యాయి. వాటిపై ఎన్టీఆర్ తెలివిగా స్పందించాడు. ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు.. అది వచ్చినప్పుడు తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందామని అన్నాడు.


Click it and Unblock the Notifications











