అందుకే మూడేళ్లు కనుమరుగయ్యా.. ఏదో కోల్పోయాననే ఫీలింగ్.. ఎన్టీఆర్ ఎమోషనల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత మీడియా, అభిమానుల ముందుకు వచ్చారు. అయితే గత మూడేళ్లుగా సినిమాలకు దూరమైన ఎన్టీఆర్ కనీసం సోషల్ మీడియాలో కూడా కనిపించలేదు. అయితే తనకు సోషల్ మీడియాపై ఉండే అభిప్రాయాన్ని యంగ్ టైగర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మీలో ఎవరు కోటీశ్వరులు షో సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..

సోషల్ మీడియాకు దూరంగా
సోషల్ మీడియాతో నా అనుబంధం అంతగా ఉండదు. నేను పలుమార్లు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాను. ఒక రకమైన ప్రపంచంలో ఉండటం నా వల్ల కాదు. నాకు అలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్, నా టీమ్ నా అభిమానులు ఆలోచనలు, అభిప్రాయాలు గురించి వివరాలు అందజేస్తారు.

నాకు ఇద్దరు పిల్లలు
నా వ్యక్తిగత కారణాల వల్ల నేను మూడేళ్లుగా సోషల్ మీడియాలో అంతగా నేను యాక్టివ్‌గా లేను. సోషల్ మీడియాలో లేకపోవడం ఏదో కోల్పోతున్నాననే ఫీలింగ్ లేదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారితో ఉంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

RRR మూవీ కారణంగానే
మూడేళ్లుగా మీడియాలో లేకపోవడానికి కారణం RRR. ఆ ప్రాజెక్ట్ నన్ను అలా చేసింది. ఆ ప్రాజెక్టు నాలో చాలా ఉత్సాహాన్ని నింపుతున్నది. తెలుగు ప్రజల కోసం పోరాటం చేసిన హీరోల గురించిన కథలో భాగం కావడం గర్వంగా ఉంది. మూడేళ్లు ప్రేక్షకులకు దూరంగా ఉన్న ఎలాంటి అసంతృప్తి లేదు అని ఎన్టీఆర్ తెలిపారు.

సక్సెస్ కాన్ఫిడెన్స్ ఇస్తుందంటూ
ఎవరు మీలో కోటీశ్వరులు షో గురించి నా ఆలోచన ఏమిటంటే.. సక్సెస్ డబ్బు తీసుకు వస్తుంది. సక్సెస్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ షోకు వచ్చే వాళ్లు ఎంత డబ్బు గెలుచుకొంటారో నాకు అనవసరం. కానీ పోటీదారులు జీవితంలో విజయం సాధించడానికి ఎంత కాన్ఫిడెన్స్‌ను కూడగట్టుకొన్నారనేది నాకు ముఖ్యం. వారిలో కాన్ఫిడెన్స్‌ను పెంచడానికి ప్రయత్నిస్తాను అని ఎన్టీఆర్ చెప్పారు.


Click it and Unblock the Notifications











