»   » అన్నయ్య, నేను, బాబాయ్...ఈ ఏడాది మాదేనన్న ఎన్టీఆర్

అన్నయ్య, నేను, బాబాయ్...ఈ ఏడాది మాదేనన్న ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘టెంపర్' మూవీ ఆడియో వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. గత రెండు మూడు సినిమాలుగా నేను అభిమానుల్ని నిరాశపరిచానని మనిషిగా ఒప్పుకుంటున్నా. అభిమానులు కాలరెగరేసుకుని భూమి మీద తిరగాలన్నదే నా ఆశ. అందుకోసం మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తూనే ఉంటానని తెలిపారు.

ఇన్నాళ్లూ సినిమాలను కష్టపడి చేశాను. కానీ ‘టెంపర్‌'ను కసితో చేశా. ఈ ఏడాది మీద నందమూరి నామ సంవత్సరం అని రాసి ఉంది. అన్నయ్య ‘పటాస్‌'తో మొదలుపెట్టారు. త్వరలో బాబాయ్‌ ‘లయన్‌'గా రానున్నారు. నేను 11 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో చేసిన ‘టెంపర్‌' తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. అనూప్‌తో ‘రభస'కే పనిచేయాల్సింది. ఈ సినిమాకి కుదిరింది'' అని ఎన్టీఆర్‌ అన్నారు.


కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘పటాస్‌, టెంపర్‌, లయన్‌.. సినిమాల టైటిళ్లు మూడు అక్షరాలతో ఉన్నాయి. ఈ ఏడాది నందమూరి సినిమాల దండయాత్ర జరుగుతుంది. ఈ సినిమాకు తమ్ముడు హార్ట్‌ అండ్‌ సోల్‌ మొత్తం పెట్టి పనిచేశాడు'' అని అన్నారు.


బాక్సాఫీసును దున్నేస్తారు

బాక్సాఫీసును దున్నేస్తారు

నందమూరి హీరోల కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ ఏడాది బాక్సాఫీసును దున్నేయడం ఖాయం అని అంటున్నారు అభిమానులు.


భారీగా విడుదల

భారీగా విడుదల

‘టెంపర్' చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


రెస్పాన్ అందిరింది

రెస్పాన్ అందిరింది

నిన్న విడుదలైన టెంపర్ ఆడియోతో పాటు, థియేట్రికల్ ట్రైలర్‌కు రెస్పాన్స్ అదిరిపోయింది.


టెంపర్

టెంపర్

ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ పొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. కాజల్ హీరోయిన్. ఫిబ్రవరి రెండో వారంలో సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


English summary
"My only ambition is to make you (Nandmauri fans) proud such that you all raise your shirt collars and claim as Nandamuri fans with pride. That day is no longer. I neither need a hit nor a flop, I'm here today because of fans and veteran NTR. If I wear a shirt or a pant, that's all because of you. I'm doing films for you." NTR said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu