జూ ఎన్టీఆర్ 'అదుర్స్' ఆడియో రిలీజ్ డేట్ ఛేంజ్
జూ ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్లో రెడీ అయిన అదుర్స్ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ ఐదుకు వాయిదా పడింది. మొదట ఈ ఆడియోను మూడున జరపాలని నిర్ణయించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల డేట్ చేంజ్ చేయవలసివచ్చిందని వివివినాయిక్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆడియోను ముందనుకున్నట్లుగా మూడున కాక డిసెంబర్ ఐదు న జరపాలని నిర్ణయించాం. శిల్పకళా వేదికలో ఈ ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. అలాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్వి పాత్రల్లో కనిపిస్తారు. రెండు పాత్రలూ దేనికదే వైవిద్యంగా ఉండి అలరిస్తాయి. అలాగే ఎన్టీఆర్ ఫెరఫార్మన్స్ ని అందరూ మెచ్చుకుంటారు. నాకూ,ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇది మూడో చిత్రం..అలాగే హ్యాట్రిక్ అవుతుందని చెప్పగలను అన్నారు ధీమాగా. ఇక ఈ చిత్రం ఆడియోను దేవీశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందించారు. షూటింగ్ ఫినిష్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంతకు ముందు ఎన్టీఆర్,వినాయిక్ కాంబినేషన్లో సాంబ, ఆది చిత్రాలు వచ్చాయి. అలాగే ఎన్టీఆర్ తన కంత్రి చిత్రం తర్వాత రిలీజు అవుతున్న చిత్రం ఇదే. వినాయిక్,రవితేజ కాంబినేషన్లో వచ్చిన కృష్ణ అనంతరం దీని పైనే వినాయిక్ వర్క్ చేసారు.


Click it and Unblock the Notifications











