జూ ఎన్టీఆర్ కలకత్తాలో స్వైర విహారం
వి.వి. వినాయక్ రీసెంట్ గా దర్శకత్వం వహించిన 'కృష్ణ" సినిమా తర్వతా, వి.వి.వినాయక్ దర్శకత్వం, వంశీ మోహన్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'అదుర్స్". అక్టోబర్ 14న విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతుండగా, డిసెంబర్ లో విడుదల చేయాలనేది ఇప్పటి ప్రపోజల్ అని, ఇందువల్ల సంక్రాతి సీజన్ కూడా టార్గెట్ అవుతుందని దర్శక నిర్మాతల ప్లాన్ అని తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ ను కలకత్తాలో జరుపుకొంటోంది దీంతో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రం కోడాలి నాని సమర్సణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రూపొందటం విశేషం.
'కంత్రి" సినిమా తర్వాత ఎన్టీఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాకపోవడం 'ఆది", 'సాంబ" చిత్రాల తర్వాత ఎన్టీఆర్ - వినాయక్ హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందటంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. జూ.ఎన్టీఆర్ హీరో సరసన నయనతార, షీలా కథానాయికలుగా నటిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బ్రాహ్మణ యువకుడుగా పర్ ఫార్మెన్స్ అదరగొడతాడనీ, రెండో గెటప్ లో ఎన్టీఆర్ గ్లామర్ గా కనిపిస్తారనీ తెలుస్తోంది. వి.వి. వినాయక్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా అందరితోనూ 'అదుర్స్" అనిపించేరీతిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ సినిమా పేరును అధికారికంగా ప్రకటించకపోవడంతో 'అదుర్స్" అనే పేరు వర్కింగ్ టైటిల్ గా ప్రాచుర్యం పొందుతోంది. దర్శకనిర్మాతలు ఈ విషయమై మౌనం పాటిస్తుండడంతో అభిమానులంతా ఈ సినిమాతో ఎన్టీఆర్ అదుర్స్ అనిపిస్తాడని ఆశలు పెంచుకుంటున్నారు. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించటం మరో విశేషం.


Click it and Unblock the Notifications











