వివి వినాయిక్, జూ ఎన్టీఆర్ టైటిల్ అదుర్స్ కాదు..మరి
జూ ఎన్టీఆర్, వివి వినాయిక్ కాంబినేషన్లో రెడీ అవుతున్న చిత్రానికి మొదటనుంచీ అదుర్స్ అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఈ చిత్రానికి అదుర్స్ కాకుండా నా పుత్రుడు అనే టైటిల్ ని ఫైనలైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పుత్రుడు టైటిల్ అనుకుంటే అది వేరే చిత్రానికి పెట్టుకున్నారు. దాంతో నా పుత్రుడు పెడదామనుకుంటున్నట్లు చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం స్టిల్స్ బయిటకు వచ్చి అబిమానులుకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి. ఈ స్టిల్స్ లో జూ ఎన్టీఆర్ బ్రాహ్మణుడు గెటప్ లో బ్రహ్మానందం ప్రక్కన ఉన్నారు. కథ ప్రకారం జూ ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్వి పాత్రలను పోషిస్తున్నాడు. అందులో ఒక పాత్ర నరసింహాచారి కాగా మరో పాత్ర నరసింహ అని వినికిడి. సెకెండాఫ్ లో అన్ని డ్యూయల్ రోల్ చిత్రాలు లాగానే పాత్రలు తారుమారవటం..అందు నుంచి వచ్చే కామిడీ అని నవ్విస్తుందంటున్నారు.
సీమశాస్త్రి తరహాలో జూ ఎన్టీఆర్..డాన్ ప్లేస్ లోకి వెళ్లి అక్కడ చేసే పోరాటాలు పూర్తి వినోదాన్ని పంచుతాయంటున్నారు. ఇక ఈ సినిమా పూర్తి స్ధాయి ఎంటర్టైన్ మెంట్ తో రూపొందుతోందని చెప్తున్నారు. నా అల్లుడు సినిమా తర్వాత డ్యూయల్ కాన్సెప్ట్ (ఆ సినిమాలో ఒక్కడే కనపడతాడు అయినా సినిమా అంతా ఇద్దరు ఉన్నారన్న భ్రమ కలిగిస్తారు)తో రెడి అవుతున్న చిత్రం ఇదే. దాంతో జూ ఎన్టీఆర్ అభిమానులే కాక మిగతా వారు కూడా ఈ సినిమాను ఆసక్తితో చర్చించుకుంటున్నారు. వారి అంచనాలుకు తగ్గకుండా సినిమా తయారుఅవుతుందని ఆశిద్దాం. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై కొడాలి నాని, వల్లభనేని వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











