SS Rajamouli బాక్సాఫీస్ బొనాంజా.. రీ రిలీజ్‌కు ఎన్టీఆర్ బిగ్ మూవీ.. ఎప్పుడంటే?
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ-రిలీజ్ లో ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్లు సాధించిన సినిమాలను మళ్లీ థియేటర్లలో వేస్తూ మంచి వసూళ్లు రాబడుతున్నారు. ప్రస్తుతం సినిమాలు పెద్దగా లేకపోవడంతో రీ-రిలీజ్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా 'ఆరెంజ్', అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా 'దేశ ముదురు' మూవీస్ రీ-రిలీజ్ కాగా మంచి కలెక్షన్లు రాబట్టాయి.
ఇదే ఊపులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమా కూడా రీ-రిలీజ్ అయింది. అయితే ఈ ఫ్లాప్ సినిమాను జనం ఇప్పుడు కూడా తిరస్కరించారు. పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో తారక్ రాజమౌళి కాంబోలో వచ్చి సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన సింహాద్రి సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. డేట్ కూడా ఫిక్స్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన సింహాద్రి సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్, ఎస్.ఎస్ రాజమౌళి కెరీర్ లను మలుపు తిప్పిన సినిమా ఇది. రోమాలు నిక్కబొడితే హీరో ఎలివేషన్లను అప్పట్లోనే రాజమౌళి చాలా పవర్ ఫుల్ గా చూపించేశాడు. కేరళలో రౌడీలను సింహాద్రి పరిగెత్తించి మరీ కొట్టే సీన్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి.
ఆంధ్రావాలా సినిమా రీ-రిలీజ్ కాగా అది చెప్పుకునే రీతిలో ఆకట్టుకోలేక పోయింది. ఫ్యాన్స్ కూడా ఆ సినిమాను పట్టించుకున్నట్లుగా లేదు. ఆంధ్రావాలా ఫ్లాప్ సినిమా కాబట్టి పెద్దగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేక పోయిందని అనుకోవచ్చు. అయితే సింహాద్రి ఆట్ టైం రికార్డు బద్దలు కొట్టిన సినిమా. సో రీ-రిలీజ్ లో కూడా దుమ్ము లేపుతుందని అభిమానులు అంటున్నారు.

సింహాద్రి రీ-రిలీజ్ పై యంగ్ హీరో విశ్వక్ సేన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. 'వస్తున్నాడు.. మాస్ అమ్మ మొగుడు తారక్ అన్న పుట్టిన రోజు నాడు సింహాద్రి 4K రీ-రిలీజ్ అవుతుంది థియేటర్లలో మాస్ జాతర కోసం వెయిటింగ్. జై ఎన్టీఆర్' అంటూ విశ్వక్ సేన్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











