Ram Charan Birthdayకు రాని తారక్, బన్నీ.. మరో ముగ్గురు స్టార్ హీరోలు దూరం.. కారణం?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. రౌద్రం రణం రుధిరం మూవీ అనేక అవార్డులతో పాటు ఆస్కార్ ను సైతం కొల్లగొట్టింది. దీంతో రామ్ చరణ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయి గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇక ఈ సినిమాతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో రామ్ చరణ్ కు మంచి అనుబంధం ఏర్పడింది. ఇదిలా ఉంటే తాజాగా మార్చి 27న చెర్రీ పుట్టినరోజు వేడుకలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ హాజరు కాగా మంచి స్నేహితుడిగా, సోదరుడిగా చెప్పుకున్న ఎన్టీఆర్ తోపాటు అల్లు అర్జున్ రాకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

గ్లోబల్ స్టార్ డమ్..
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసి మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత మగధీర సినిమాతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు. వరసుగా పలు సినిమాలు చేస్తూ మెగా పవర్ స్టార్ గా మారిన చెర్రీ.. గతేడాది RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. గ్లోబల్ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు.

మొత్తంగా అన్ని సినిమాలు..
RRR సక్సెస్ తో రామ్ చరణ్ తన సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. అందుకే క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దానికి గేమ్ చేంజర్ అని ఇటీవలే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉప్పెన సినిమా ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు టాక్. మరో రెండు చిత్రాలతో పాటు విక్రమ్ మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజుతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపించాయి.

జనసేనకు విరాళం..
ఇక రామ్ చరణ్ సినిమాల విషయం పక్కన పెడితే.. మార్చి 27 సోమవారం రోజునన చెర్రీ 39వ వసంతంలోకి అడుగు పెట్టాడు. రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఆదివారం అంటే మార్చి 26 నుంచే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఆయన బర్త్ డే సందర్భంగా అప్పట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆరెంజ్ మూవీని రీరిలీజ్ చేశారు. ఇప్పుడు మాత్రం ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది. అలాగే దాంతో వచ్చిన కలెక్షన్స్ ను జనసేనకు విరాళంగా ఇస్తున్నట్లు తెలిసిన విషయమే.

సెలబ్రిటీల సందడి..
మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలను మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో గ్రాండ్ గా నిర్వహించారు. దీంతో మెగా సంబురాలు అంబురాన్నంటాయి. ఇక ఈ వేడుకకు ఎంతోమంది టాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణి, అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్, వెంకటేష్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రశాంత్ నీల్, మెహర్ రమేష్, కాజల్ అగర్వాల్ దంపతులు, మంచు మనోజ్, ఉత్తేజ్ తదితరులు ఉన్నారు.

హైదరాబాద్ లో ఉన్నప్పటికీ..
అయితే రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు మొత్తంగా నలుగురు పాపులర్ సెలబ్రిటీలు రాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అందులో ముఖ్యంగా చెర్రీకి సోదరుడు, మంచి స్నేహితుడు, ఇద్దరు నాటు నాటు అంటూ స్టెప్పులేసి ఆస్కార్ తీసుకురావడంలో భాగం పంచుకున్న ఎన్టీఆర్ రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే తారక్ హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NTR30 మూవీ షూటింగ్ కారణంగా మారిందని సమాచారం.

మంచి అనుబంధం ఉండి కూడా..
NTR30 మూవీ షూటింగ్ రాత్రి వేళలో జరగడంతో చెర్రీ పుట్టినరోజు వేడుకలకు ఎన్టీఆర్ అటెండ్ కాలేకపోయాడని తెలుస్తోంది. అలాగే మరో మెగా హీరో, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ వేడుకలకు రాకపోవడం కూడా చర్చనీయాంశమైంది. అలాగే చెర్రీతో మంచి అనుబంధం ఉన్న నందమూరి బాలకృష్ణ కూడా హాజరు కాలేదు. వీళ్లతో పాటు మంచు మోహన్ బాబు, విష్ణు హాజరు కాకపోవడం గమనార్హం. మోహన్ బాబు, విష్ణు ఏదో ట్రిప్ లో ఉండి రాలేదని సమాచారం.


Click it and Unblock the Notifications











