జూ ఎన్టీఆర్-అల్లు అర్జున్...ఎవరి స్టైల్ అదిరింది? (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: ఒకరేమో యంగ్ టైగర్ బిరుదుతో అద్భుతమన డైలాగ్ డెలివరీతో తెలుగు నాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటే...మరొకరేమో స్టైలిష్ స్టార్ బిరుదు పొంది ప్రతి సినిమాలోనూ వెరైటీ స్టెప్పులతో భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు. పోటా పోటీగా కెరీర్ సాగిస్తున్న ఈ ఇద్దరూ దేశంకాని దేశంలో అనుకోకుండా తారస పడ్డారు. తమ స్టైలిష్ లుక్ తో ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వారెవరో కాదు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, మరొకరు సైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ఈ ఇద్దరు స్టార్స్ తమ తమ సినిమాల షూటింగులో భాగంగా స్పెయిన్ వెళ్లగా అనుకోకుండా ఇరువురూ దగ్గరి దగ్గరి లొకేషన్లకు చేరుకున్నారు. షూటింగులను కాసేపు పక్కన పెట్టి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేసారు. అందుకు సంబంధించిన ఫోటోలను క్రింద స్లైడ్ షోలో వీక్షించవచ్చు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రం చేస్తుండగా, మరో వైపు అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో'చిత్రం చేస్తున్నారు. ఈ ఫోటోల్లో ఎవరి స్టైల్ అదరింది. ఎవరు గెటప్ ఆకట్టుకునేలా ఉంది? అనే విషయాపై మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ బాక్సులో వెల్లడించండి....

జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ సినిమాల షూటింగులో భాగంగా స్పెయిన్ వెళ్లగా అక్కడ కలుసుకున్నారు.

ఇద్దరు హీరోలతో పాటు ఈ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల కూడా ఇక్కడ చిత్రంలో చూడొచ్చు.

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘బాద్ షా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.

ప్రస్తుతం జూ ఎన్టీఆర్‌పై స్పెయిన్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ‘బాద్ షా' చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది.

దర్శకుడు శ్రీను వైట్ల ‘బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటోంది.

అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











