బాలీవుడ్ హీరోకు ఎసరు పెట్టిన NTR..ఆ బిగ్ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేసిన తరువాత రిజెక్ట్..పోటీలో బన్నీ కూడా?

ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు లభిస్తోంది. ముఖ్యంగా రాజమౌళి కారణంగా మన స్టార్ హీరోలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక త్వరలోనే బాలీవుడ్ స్టార్స్ చేయాలనుకున్న సినిమాలు కూడా మన వారి చేతుల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక స్టార్ హీరో చేయాల్సిన సినిమాను తనవైపు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా బాలీవుడ్ స్టార్ ను రీప్లేస్ చేయబోతున్నట్లు టాక్ వస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Jr. NTR and Allu Arjun in the Race to Replace Ranveer Singh in The Immortal Ashwatthama

సక్సెస్ తర్వాత: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. విదేశాల్లో కూడా ఈయన సినిమాలను చాలా ఇష్టంగా చూస్తుంటారు ఫ్యాన్స్. అయితే RRR సినిమా సూపర్ సక్సెస్ తర్వాత తారక్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఒక్క ఎన్టీఆర్ యే కాకుండా రామ్ చరణ్ కు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది.

త్వరలోనే వార్ 2: ఈ క్రమంలోనే ఈ హీరోలు అటు బాలీవుడ్ వీలైతే హాలీవుడ్ లోనూ నటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. వార్-2 సినిమాకి ఇప్పటికే సంతకం చేసి తన ఎంట్రీని ఖరారు చేసేశారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ మేయిన్ లీడ్ లో రానున్న ఆ ప్రాజెక్ట్ లో తారక్ పవర్ఫుల్ రోల్ లో కనిపించబొతున్నట్లు టాక్.

Jr. NTR and Allu Arjun in the Race to Replace Ranveer Singh in The Immortal Ashwatthama

ఇమ్మోర్టల్స్ అశ్వత్థామ: అయితే తాజాగా బీటౌన్ లో తెరకెక్కుతున్న ది ఇమ్మోర్టల్స్ అశ్వత్థామ అనే చిత్రం కోసం తారక్ ను అనుకుంటున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత ఉరి ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే భారీ మైఠలాజికల్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ముందుకు ఈ సినిమాకు హీరోగా ఉరి హీరో విక్కీ కౌశల్ ను తీసుకోవాలనుకున్నారు.

ఎన్టీఆర్ లేదా బన్నీ?: ఆ తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈయనను కూడా పక్కన పెట్టేశారు. అయితే ఈ చిత్రంలో హీరోగా తారక్ ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరిని తీసుకుంటారని టాక్ వినిపిస్తోంది.

Jr. NTR and Allu Arjun in the Race to Replace Ranveer Singh in The Immortal Ashwatthama

ఇద్దరిలో ఎవరో ఒకరు: ఇందుకోసం చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నటుల్లో ఓ ఒక్కరూ సినిమాలో నటించిన భారీగా క్రేజ్ వస్తుందని చిత్రబృందం భావిస్తోందట. అంతేకాదండోయ్ జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి ఈ పాత్ర బాగా సెట్ అవుతుందని.. ఈ క్రమంలోనే తారక్ యే ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. మరి చూడాలి ఈ చిత్రంలో హీరోగా ఫైనల్ గా ఎవరు సెలెక్ట్ అవుతారనేది.

Jr. NTR and Allu Arjun in the Race to Replace Ranveer Singh in The Immortal Ashwatthama

జియో స్టూడియోస్: అయితే ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ ప్రాజెక్టుకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించేందుకు ముందుగా ఓకే చెప్పారు. కారణాలు ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత ఈయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని టేకప్ చేసింది. ఈ క్రమంలోనే తారక్ లేదా బన్నీలను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నారు. అలాగే స్టార్ సమంత హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X