జూ ఎన్టీఆర్ తో ఏ సమస్యా?..మేం ప్రెండ్స్ మి
నా లిమిటేషన్స్ నాకు తెలుసు అయినా నాకు, తారక్ కి మధ్య ఏ సమస్యలూ లేవూ..అయినా మా సినిమాలు కూడా వేర్వేరు తరగతిలుకు సంభందించినవి. ఎన్టీఆర్ ఓ మాస్ హీరో, నేను ప్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తూండే హీరోని అంటూ చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్. తాజాగా జయీభవ సక్సెస్ మీట్ సందర్బంగా కలిసిన మీడియాతో ఆయన ముచ్చటిస్తూ ఎన్టీఆర్ తో మీరు పోటీ ఫీలవుతున్నారా అన్నదానికి ఇలా సమాధానం చెప్పారు. ఇక ఎన్టీఆర్ తానూ సినిమాలు గురించి, లొకేషన్స్ గురించి, షాట్స్ గురించి మాట్లాడుకుంటామని చెప్పాడు. అలాగే నేను నా ప్రాజెక్టు గురించి, అతను తన ప్రాజెక్టులు గురించి ఎప్పుడూ చర్చించుకుంటాము. అయితే షూటింగ్ లు జరుగుతున్నప్పుడు మాత్రం కలవటం కుదరదు. ఇక మాఇద్దరి మధ్యా ఏదో రైవర్లీ ఉన్నట్లు రాస్తున్నారు..అలాంటిదేమీ లేదు.అది రూమర్ మాత్రమే.
ఇక తన విజయం గురించి చెపుతూ సక్సెస్ అనేది అందరికీ ఒకేసారి రాదు..అలాగే అందరూ హృతిక్ రోషన్ లు కాలేరు..రాత్రికి రాత్రి స్టార్స్ కావటానికి, లక్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. తనను తాను ఓ ఇంట్రావర్ట్ గా అబివర్ణించుకునే కళ్యాణ్ రామ్ ఖాళీ దొరికితే భార్య, రెండు సంవత్సరాల బాబుతో ఎక్కువ గడపటానికి ఇష్టపడతాడు. ఇక పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ..నేను రాజకీయాలకు ఇంకా రెడీ కాలేదు అన్నారు.


Click it and Unblock the Notifications











