మిస్ యూ నాన్న.. హరికృష్ణ జయంతిపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమోషనల్

సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారు స్వర్గీయ నందమూరి హరికృష్ణ. చైతన్య రథ సారథిగా తెలుగు రాష్ట్రరాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఇక సినిమాల్లోనూ తనదైన నటనతో అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. సీతారామరాజు, శ్రీరాములయ్య, సీతయ్య వంటి భిన్న చిత్రాల్లో నటించి అందర్నీ మెప్పించారు. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెంది లక్షల మంది అభిమానులను ఒంటరి చేసి వెళ్లిపోయారు. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎమోషనల్ అయ్యారు.

'ఈ అస్తిత్తం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే. నందమూరి కళ్యాణ్ రామ్.. నందమూరి తారక రామారావు 'అంటూ నందమూరి హరికృష్ణకు నివాళి అర్పించారు. మీ 64వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ.... మిస్ యూ నాన్న అంటూ జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు చేశారు.

Jr NTR And Kalyan Ram recalls Harikrishna On His 64th Birth Anniversary

మరో వైపు సినీ, రాజకీయ ప్రముఖులెందరో హరికృష్ణను స్మరించుకుంటున్నారు. ఎన్టీఆర్ చిరకాల మిత్రుడు రాజీవ్ కనకాల హరికృష్ణ జయంతి సందర్భంగా ఎమోషనల్ అయ్యాడు. గోల్డ్ హార్ట్, డైనమిక్, వర్సటైల్, గొప్ప వ్యక్తి నందమూరి హరికృష్ణ గారి 64వ జయంతి నేడు. తండ్రి సేవలో తరించడం కోసం పుట్టిన వ్యక్తి.. తండ్రి కోసం అన్నింటిని త్యాగాలు చేసే వ్యక్తి.. ఆయన జీవితం తండ్రికే అంకితం.. అంటూ రాజీవ్ అందర్నీ టచ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X