SIIMA 2023 Nominations: ఒకే సినిమా నుంచి బెస్ట్ యాక్టర్స్‌గా రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఎవరికిచ్చినా మోత మోతే?

ప్రతి ఏడాది సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఘనంగా నిర్వహిస్తూ... అవార్డుల ప్రదానోత్సవం కూడా నిర్వహిస్తుంటారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16వ తేదీలలో ఈ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా 2023 వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే తెలుగు బెస్ట్ హీరోల క్యాటగిరీలో పలువురు హీరోలు నామినేట్ అయ్యాయి? ఎవరెవరూ పోటీ పడుతున్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


ప్రతి ఏడాది సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఘనంగా నిర్వహిస్తారు. అయితే సైమా ఓ నామినేషన్‌ రిలీజ్‌ చేసింది. బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్ గా ఓ యాక్టర్‌ ను ఎన్నుకోవాలని తమ సోషల్ మీడియా హ్యాండిల్లో అఫీషియల్ సైట్స్‌లో పోస్ట్ రిలీజ్ చేసింది. ఇక ఆ లిస్టులో రామ్ చరణ్, ఎన్టీఆర్ పోటీ పడుతుండాగా అడవి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ, నిఖిల్ కూడా ఈ లిస్టులో ఉన్నారు.

RRR

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే బెస్ట్ ఫిలిం కు నామినేట్ అయింది. అంతే కాదు.. బెస్ట్ డైరెక్టర్ నామినేషన్ లో రాజమౌళి కూడా ఉన్నారు. ఇక ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడం తెలుగువారి ఖ్యాతిని మరింత పెంచినట్లైంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు బెస్ట్ యాక్టర్ రేసులో ఉన్నారు.

ఇక సైమా బెస్ట్ హీరో నామినేషన్ లో మేజర్ సినిమా నుంచి అడవి శేష్, డీజే టిల్లు సినిమా నుంచి సిద్ధు జొన్నలగడ్డ, సీతా రామలో దుల్కర్ సల్మాన్, కార్తికేయ2లో నిఖిల్ సిద్ధార్త్‌ నామినేట్ అయ్యారు. ఇక వీరితో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నామినేషన్ లో ఉన్నారు. అయితే ఇక్కడే ఫ్యాన్స్ వార్ తప్పేలా లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తక్కువగా చేసి చూపించారంటూ ఫ్యాన్స్ గోల అందరికి తెలిసిందే.

RRR

ఇప్పుడు సైమా బెస్ట్ యాక్టర్ ఇద్దరిలో ఏ ఒక్కరికి వచ్చినా... ఫ్యాన్ వార్ తప్పదు. అయితే నిజానికి వీరిద్దరూ బయట మంచి స్నేహితులు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వీరి మధ్య స్నేహం పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరికి అవార్డు వచ్చినా.. మిగతా హీరో ఫ్యాన్స్ గోల చేస్తారు. సినిమా టైంలోనే... ఎన్టీఆర్, రామ్ చరణ్‌ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ జరిగింది. మా వాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అని అప్పట్లో ఫ్యాన్ వార్స్ కి దిగారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ అభిమానుల మధ్య మరో సారి యుద్ధం మొదలవనుందని అర్ధం అవుతుంది.

మరి సైమా బెస్ట్ యాక్టర్ గా ఎవరు నామినేట్ అవాతారో తెలియాలంటే.. సెప్టెంబర్ 15, 16 వరకు ఆగాల్సిందే. వీరిఇద్దరిలో ఒకరికి ఇస్తారా లేదా.. వీరికి కలిపి ఇస్తారా లేదా మిగతా హీరోలకు అవార్డు ఇస్తారా అనేది చూడాలి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. దేవర సినిమాతో ఫుల్ బిజిగా ఉన్నారు. ఇక రామ్ చరణ్ కూడా గేమ్ ఛేంజర్ సినిమాతో రానున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X