RRRకు భారీ ఎదురుదెబ్బ: సినిమాలోని మెయిన్ సీక్వెన్స్ లీక్.. ఎన్టీఆర్ ఫైట్ అలా.. చరణ్ పోరాటం ఇలా!

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్.. హై టెక్నీకల్ వ్యాల్యూస్.. అన్నింటికీ మించి ఇద్దరు స్టార్ హీరోలు.. ప్రపంచమే మెచ్చిన దర్శకుడు.. ఇలా కలిసి వస్తున్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీల కళ్లూ ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని అత్యుత్తమ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇలాంటి పరిస్థితుల్లో RRR యూనిట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా ఈ సినిమాలోని మెయిన్ సీక్వెన్స్ లీకైంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

Recommended Video

RRR Special Update Commig Soon | బాలీవుడ్ పై ఫోకస్!!
నిజమైన స్టార్లుగా మారిన టాలీవుడ్ స్టార్లు

నిజమైన స్టార్లుగా మారిన టాలీవుడ్ స్టార్లు

'బాహుబలి' వంటి సూపర్ హిట్ సిరీస్ తర్వాత రాజమౌళి తీస్తున్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). పోరాట వీరులుగా పేరొందిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, తారక్.. భీంగానూ నటిస్తున్నారు. ఐదు భాషల్లో రాబోతున్న ఈ భారీ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం ఇస్తున్నారు.

అసలైంది జరుగుతోంది.. అప్‌డేట్స్ కూడా

అసలైంది జరుగుతోంది.. అప్‌డేట్స్ కూడా

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై రెండేళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల చిత్రీకరణ చాలా వరకూ మిగిలిపోయింది. అంతేందుకు ఎంతో ముఖ్యమైన కాంబినేషన్ సీన్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించలేదు. అయితే, ఈ మధ్యే క్లైమాక్స్ సీన్ షూటింగ్ మొదలైంది. వీటికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా రెగ్యూలర్‌గా ఇస్తున్నారు.

రెండూ అదిరాయి... రికార్డుల దండయాత్ర

రెండూ అదిరాయి... రికార్డుల దండయాత్ర


ఇండియన్ సినిమాలోనే ప్రతిష్టాత్మకమైన RRRపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా రూపొందుతోంది. అందుకే ఆ మధ్య వచ్చిన టైటిల్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' విడుదలయ్యాయి. ఈ రెండూ తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసి సత్తా చాటాయి.

రెండూ సాధ్యం కాలేదు.. ఇది కన్ఫార్మేనా?

రెండూ సాధ్యం కాలేదు.. ఇది కన్ఫార్మేనా?


నిజానికి RRRను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఆరంభంలోనే ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ భారీ మూవీని అక్టోబర్ 13, 2021న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల వెల్లడించారు.

RRR టీమ్‌ను భయపెడుతోన్న అంశమిదే

RRR టీమ్‌ను భయపెడుతోన్న అంశమిదే

RRR మూవీ ప్రారంభం అయినప్పటి నుంచే ఈ షూటింగ్‌కు సంబంధించిన ఏదో ఒక న్యూస్ కానీ, ఫొటో కానీ లీక్ అవుతూనే ఉంది. గతంలో ఎన్టీఆర్ కొమరం భీం గెటప్‌కు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని ఫొటోలూ లీకయ్యాయి. దీంతో షూటింగ్ స్పాట్‌లోకి ఫోన్లు కూడా తీసుకు రావద్దని సిబ్బందిని ఆదేశించాడు జక్కన్న. అయినప్పటికీ ఇవి ఆగడం లేదు.

సినిమాలోని మెయిన్ సీక్వెన్స్ బయటకు

సినిమాలోని మెయిన్ సీక్వెన్స్ బయటకు


లీకుల విషయంలో రాజమౌళి అండ్ కో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినప్పటికీ ఏదో రకంగా ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా RRR మూవీ నుంచి మరికొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ సారి సినిమాలోని మెయిన్ సీక్వెన్స్‌ లీక్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది సినిమా యూనిట్‌కు భారీ ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ ఫైట్ అలా.. చరణ్ పోరాటం ఇలా

ఎన్టీఆర్ ఫైట్ అలా.. చరణ్ పోరాటం ఇలా

తాజాగా బయటకు వచ్చిన ఫొటోల్లో జూనియర్ ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తున్నది ఒకటి ఉంది. దీన్ని అతడి అభిమానులు 'టైగర్‌తో టైగర్ ఫైట్' అంటూ వైరల్ చేస్తున్నారు. అలాగే, హీరోయిన్‌తో కలిసి ఉన్న ఓ పిక్ కూడా లీకైంది. అలాగే, ఓ యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన క్లిప్ కూడా వచ్చింది. వీటితో పాటు రామ్ చరణ్ బ్రిటీష్ పోలీసుగా కనిపిస్తున్న ఫోటో కూడా లీకైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X