For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR First Review: విడుదలకు ముందే లీకైన రిపోర్టులు.. అసలు పాయింట్ అదే.. సినిమా ఎలా ఉంటుందంటే!

  |

  పేరుకు టాలీవుడ్ డైరెక్టరే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. 'బాహుబలి' తెలుగు సినిమా స్టామినాను విశ్వవ్యాప్తం చేసిన అతడు.. ప్రస్తుతం RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీలూ ఫోకస్ చేశాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలకు పది రోజుల ముందే ఈ సినిమా రిపోర్టులు బయటకు వచ్చేశాయి. అ సంగతులేంటో చూద్దాం పదండి!

  విప్లవ వీరులుగా మారిన హీరోలు

  విప్లవ వీరులుగా మారిన హీరోలు

  తెలుగు గడ్డపై పుట్టిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. ఇది జనవరి 7న భారీగా రిలీజ్ కాబోతుంది.

  Akhanda OTT: బాలయ్య సినిమా స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. పండుగ కానుకగా ఆరోజే.. మరి టీవీలో ఎప్పుడంటే!

  అంచనాలు పెంచి.. రికార్డులతో

  అంచనాలు పెంచి.. రికార్డులతో

  ఎన్నో అంచనాల నడుమ ఇటీవల RRR మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఇది ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇది ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసి.. అంచనాలను కూడా బాగా పెంచేసింది.

  వరల్డ్ వైడ్‌గా 12 భాషల్లో రిలీజ్

  వరల్డ్ వైడ్‌గా 12 భాషల్లో రిలీజ్

  ఇండియన్ సినిమాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నేరుగా విడుదల చేయబోతున్నారు. అలాగే, టర్కిష్, స్పానిష్, పోర్చుగీస్, కొరియన్, జపనీస్, చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో కూడా దీన్ని డబ్బింగ్ చేస్తారని గతంలోనే ప్రకటించారు.

  భర్తతో టాలీవుడ్ హీరోయిన్ లిప్‌లాక్: ఆ ఫొటోను షేర్ చేసిన కాజల్.. పర్సనల్ పిక్ లీక్ చేయడంతో రచ్చ

  ప్రమోషన్స్.. ఆ భాషల్లో కంప్లీట్

  ప్రమోషన్స్.. ఆ భాషల్లో కంప్లీట్

  RRR మూవీ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయిపోయాయి. ఇందులో భాగంగానే ముంబై, చెన్నై, తిరువనంతపురంలో ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా నిర్వహించారు. వీటన్నింటికీ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఇప్పుడు బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేస్తున్నారు.

  RRR మూవీ ఫస్ట్ రివ్యూ రివీల్

  RRR మూవీ ఫస్ట్ రివ్యూ రివీల్


  క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీ విడుదలకు పది రోజుల సమయం ఉన్నా దీని గురించి ఎన్నో రకాల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ చిత్రం తరచూ ట్రెండింగ్ అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఒకటి బయటకు వచ్చింది. ఇది అభిమానులు, సినీ ప్రియులను మరింత ఉత్సాహపరిచేలా ఉంది.

  Bigg Boss: వీజే సన్నీకి వంద కోట్ల ఆఫర్.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. రిజెక్ట్ చేసి షాకిచ్చాడుగా!

  సినిమా ఎలా ఉంటుందంటే

  సినిమా ఎలా ఉంటుందంటే


  తాజాగా బయటకు వచ్చిన బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం.. RRR మూవీ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందట. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టులు అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయని అంటున్నారు. హిందీలోనే కాదు.. ప్రాంతీయ భాషల్లో సైతం ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చే ఛాన్స్ ఉంది.

  మూవీ అసలు పాయింట్ అదే

  మూవీ అసలు పాయింట్ అదే


  ప్రముఖ బాలీవుడ్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. RRR మూవీ విజువల్ వండర్‌గా ఉండబోతుందట. అన్నింటికీ మించి ఈ సినిమా ఇద్దరు హీరోల మధ్య స్నేహబంధాన్ని అద్భుతంగా చూపించే పాయింట్‌తో రూపొందిందని తెలుస్తోంది. రాజమౌళి మార్కుకు, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఇది ఉంటుందని తెలిసింది. దీంతో కొత్త చరిత్ర నమోదు కాబోతుందన్న మాట.

  English summary
  Jr NTR and Ram Charan Did RRR Movie under Rajamouli Direction. Now This Movie First Review Reports Are Out.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X