For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR Glimpse: హైఓల్టేజ్ యాక్షన్‌తో సర్‌ప్రైజ్ చేసిన రాజమౌళి.. చివరి షాట్‌కు గూస్‌బమ్స్ ఖాయం

  |

  తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి చిత్రంతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ఆయన.. అన్ని ఇండస్ట్రీలూ మనవైపు చూసేలా చేశాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమా చేస్తున్నాడు. భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ భారీ మల్టీస్టారర్ మూవీ నుంచి గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం? దీనిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  రియల్ హీరోలుగా మారిన స్టార్ హీరోలు

  రియల్ హీరోలుగా మారిన స్టార్ హీరోలు


  స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఈ భారీ చిత్రంలో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా నటిస్తోన్నారు.

  హాట్ ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: డ్రెస్ ఉన్నా లేనట్లే అందాల విందు.. ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

  ఎన్నో ఆటంకాలు... మూడేళ్లకు కంప్లీట్

  ఎన్నో ఆటంకాలు... మూడేళ్లకు కంప్లీట్

  RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ 2018లోనే ప్రారంభం అయింది. దీన్ని ఎంత త్వరగా పూర్తి చేయాలని భావించినా అనివార్య కారణాలతో తరచూ చిత్రీకరణ వాయిదా పడుతూనే వచ్చింది. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా ఇది రెండు సార్లు ఆపేయాల్సి వచ్చింది. ఫలితంగా చిత్రీకరణ అంతకంతకూ ఆలస్యం అవుతూనే వచ్చింది. ఇలా ఈ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకుంది కూడా.

  రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన యూనిట్

  రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన యూనిట్

  2020లోనే RRR ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాని కారణంగా అది సాధ్యపడలేదు. దీని తర్వాత 2021 జనవరి 8కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా షూట్ కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 13, 2021న రిలీజ్ చేస్తామని తెలిపారు. కానీ, దీన్ని 2022 జనవరి 7న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించిన సంగతి విధితమే.

  బెడ్‌పై బ్రాతో బాలయ్య హీరోయిన్: దారుణమైన ఫోజులతో అందాల ఆరబోత.. చూసి తట్టుకోవడం కష్టమే

  రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టేసింది

  రిలీజ్‌కు ముందే రికార్డులు కొట్టేసింది

  ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే దీని నుంచి ఏది వచ్చినా ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ మూవీ నుంచి మోషన్ పోస్టర్, ఆ తర్వాత రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం'.. ఫ్రెండ్‌షిప్ సాంగ్ సహా ఎన్నో విడుదలయ్యాయి. వీటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో రికార్డులు బద్దలయ్యాయి.

  భారీ స్థాయిలో అంచనాలు.. బిజినెస్‌తో

  భారీ స్థాయిలో అంచనాలు.. బిజినెస్‌తో

  పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందుతోన్న RRR (రౌద్రం రణం రుధిరం)పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా ప్రభావం ఇండియన్ సినిమాపై భారీగా పడే అవకాశం ఉందని విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. గతంలో ఏ సినిమాకూ లేని విధంగా ఈ చిత్రం రైట్స్ అమ్ముడుపోయాయి.

  Unstoppable: బాబుకు టీడీపీని ఎందుకిచ్చావ్ అన్న మోహన్ బాబు.. చిరును లాగుతూ బాలయ్య షాకింగ్ రియాక్షన్

  గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారుగా

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న RRR మూవీ నుంచి తాజాగా చిత్ర యూనిట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్‌తో సాగిన ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇందులో కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

  Recommended Video

  KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
  అందరూ కవర్.. వాళ్లిద్దరు హైలైట్‌గా

  అందరూ కవర్.. వాళ్లిద్దరు హైలైట్‌గా

  తాజాగా విడుదలైన గ్లిమ్స్ వీడియోలో రాజమౌళి అందరు నటీనటులను కవర్ చేసి చూపించాడు. మరీ ముఖ్యంగా చిత్ర హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను హై ఓల్టేజ్‌గా చూపించాడు. అలాగే, యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా హైలైట్ చేశాడు. ఈ వీడియో చివర్లో వచ్చే సీన్ మాత్రం గూస్‌బమ్స్ తెప్పించేలా ఉంది. మొత్తానికి ఈ గ్లిమ్స్ వీడియోతో రాజమౌళి టీమ్ అందరినీ ఫిదా చేసేసింది.

  English summary
  Tollywood Most Anticipated Movie RRR. Jr NTR and Ram Charan Starring this Movie under Rajamouli Direction. Now This Film Glimpse Video Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X