For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR నుంచి సర్‌ప్రైజింగ్ న్యూస్: అనుకోకుండా అదే షాట్‌తో.. రిలీజ్ డేట్ తీసేయడంతో అనుమానాలు

  |

  భారతదేశం మొత్తంలో చాలా సినీ ఇండస్ట్రీలు ఉన్నాయి. అన్నింట్లోనూ ఎన్నో రకాల చిత్రాలు తెరకెక్కుతూ ఉంటాయి. కానీ, కొంత కాలంగా అందరి దృష్టి ఒకే చిత్రంపై పడింది. అదే.. టాలీవుడ్‌లో రూపొందుతోన్న RRR (రౌద్రం రణం రుధిరం). 'బాహుబలి'తో టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  విప్లవ వీరులుగా మారిన టాలీవుడ్ స్టార్లు

  విప్లవ వీరులుగా మారిన టాలీవుడ్ స్టార్లు

  తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. భీంగానూ చేస్తున్నారు.

  టాప్‌ను అమాంతం పైకి లేపిన విష్ణుప్రియ: అందాలు కనిపించేలా ఘాటు ఫోజులతో రచ్చ

  ఎన్నో ఆటంకాలు.. మూడున్నరేళ్లు పూర్తి

  ఎన్నో ఆటంకాలు.. మూడున్నరేళ్లు పూర్తి

  భారీ చిత్రం RRR రెగ్యూలర్ షూటింగ్ 2018లోనే ప్రారంభం అయింది. దీన్ని ఎంత త్వరగా పూర్తి చేయాలని భావించినా అనివార్య కారణాలతో తరచూ చిత్రీకరణ వాయిదా పడుతూనే వచ్చింది. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా ఇది రెండు సార్లు ఆపేయాల్సి వచ్చింది. ఫలితంగా చిత్రీకరణ అంతకంతకూ ఆలస్యం అవుతూనే వచ్చింది. దీంతో ఇప్పటికి మూడున్నరేళ్లు పైగానే అవుతోంది.

  రిలీజ్ డేట్ మారుతుందని.. క్లారిటీ లేదుగా

  రిలీజ్ డేట్ మారుతుందని.. క్లారిటీ లేదుగా

  RRR 2020లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాని కారణంగా అది సాధ్యపడలేదు. దీని తర్వాత 2021 జనవరి 8కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా షూట్ కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 13, 2021న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అయితే, ఇది వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై క్లారిటీ మాత్రం రావట్లేదు.

  అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

  అక్కడికెళ్లి మరీ పూర్తి చేసుకుని వచ్చారు

  అక్కడికెళ్లి మరీ పూర్తి చేసుకుని వచ్చారు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న RRR మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా మిగిలినదంతా పూర్తైందని ఇటీవలే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ వెంటనే రెండు పాటల చిత్రీకరణను కూడా ప్రారంభించేసింది. ఇందులో ఓ దాని కోసం చిత్ర యూనిట్ మొత్తం ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడ దాదాపు పది రోజులు షూట్ చేసి తిరిగి వచ్చింది. దీంతో టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయినట్లైంది.

  RRR సినిమా నుంచి సర్‌ప్రైజింగ్ న్యూస్

  RRR సినిమా నుంచి సర్‌ప్రైజింగ్ న్యూస్

  దాదాపు మూడున్నరేళ్లుగా జరుగుతోన్న RRR మూవీ షూటింగ్ తాజాగా పూర్తైనట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘కొన్ని చిన్న చిన్న సన్నివేశాలు మినహా RRR మూవీ షూటింగ్ మొత్తం పూర్తైపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ త్వరలోనే రాబోతున్నాయి' అని వెల్లడించింది.

  కాలేజ్‌ టైమ్‌లో అలాంటి పనులు.. ఆ ఉద్దేశం లేకపోయినా: నిరుపమ్ భార్య మంజుల షాకింగ్ కామెంట్స్

  అప్పుడు మొదలైన దానితోనే పూర్తైంది

  అప్పుడు మొదలైన దానితోనే పూర్తైంది

  RRR మూవీ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా వెల్లడించిన చిత్ర యూనిట్.. దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్తను కూడా తెలిపింది. ‘2018 నవంబర్ 19న ఏ బైక్ షాట్‌తో సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టామో.. ఊహించని విధంగా ఇప్పుడు అదే బైక్ షాట్‌తో చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేసుకున్నాము' అంటూ ట్విట్టర్‌లో పేర్కొంది. మూవీ షూటింగ్ కంప్లీట్ అవడంపై రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  Sanjana Galrani డ్రగ్స్‌ కేసు పై స్పందించిన హీరోయిన్ సంజన | Interview Part 3
  రిలీజ్ డేట్ తీసేయడంతో అనుమానాలు

  రిలీజ్ డేట్ తీసేయడంతో అనుమానాలు

  ఈ మధ్య కాలంలో RRR మూవీకి సంబంధించిన ఏ అప్‌డేట్ ఇచ్చినా.. ఆ టైటిల్ కింద అక్టోబర్ 13, 2021 అని రిలీజ్ డేట్‌ను ఉంచేవారు. కానీ, తాజాగా చేసిన ట్వీట్‌లో మాత్రం ఆ విడుదల తేదీ కనిపించలేదు. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడబోతుందంటూ కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లైంది. దీంతో కొత్త డేట్ ఎప్పుడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  English summary
  Tollywood Most Anticipated Movie RRR. Except a couple of pickup shots, officially done with the entire shoot of Jr NTR and Ram Charan Starrer Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X