RRR Twitter Review: తెలుగోడు మీసం తిప్పే టాక్.. ఇండియన్ చరిత్రలో తొలిసారి.. ఏ హీరో రోల్ బాగుందంటే!

ఈ మధ్య కాలంలో కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోన్న చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. ఈ చిత్రాన్ని దేశమే మెచ్చిన డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందించడంతో పాటు ఇందులో టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండం వల్లే ఈ హైప్ క్రియేట్ అయింది. అదే సమయంలో విడుదలకు ముందే ఈ చిత్రం భారీ బజ్‌ను ఏర్పరచుకుంది. ఇలా ఎన్నో అంచనాలతో ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి ఎలాంటి టాక్ వచ్చింది? ఇందులో ప్లస్ మైనస్ పాయింట్స్ ఏంటి? ఏ హీరో రోల్ ఎలా ఉంది? అనేవి చూద్దాం పదండి!

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన RRR

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన RRR

స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు. ఇది ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అంచనాలు పెంచిన అప్‌డేట్స్

అంచనాలు పెంచిన అప్‌డేట్స్

ఆరంభం RRR మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. మరీ ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్‌కు దేశ వ్యాప్తంగా స్పందన దక్కింది. అలాగే, ఈ చిత్రంలోని పాటకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం నమోదై అంచనాలు రెట్టింపయ్యాయి.

రికార్డు బిజినెస్‌తో గ్రాండ్‌గానే

రికార్డు బిజినెస్‌తో గ్రాండ్‌గానే

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. దీంతో ఇలా కూడా ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసుకుంది.

RRR మూవీకి అలాంటి టాక్

RRR మూవీకి అలాంటి టాక్

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీ ఇప్పటికే అమెరికా సహా ఎన్నో ప్రాంతాల్లో ప్రీమియర్ షోలను పూర్తి చేసుకుంది. అన్ని చోట్లా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను చూసిన వాళ్లంతా ట్విట్టర్ ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. ఇది తెలుగోడు మీసం తిప్పే సినిమా అని ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇలా ఆరంభంలోనే దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది.

ఫస్టాఫ్.. సెకెండాఫ్ రిపోర్టులు

ఫస్టాఫ్.. సెకెండాఫ్ రిపోర్టులు

RRR మూవీని చూసిన వాళ్ల అభిప్రాయం ప్రకారం.. ఫస్టాఫ్ మొత్తం క్యారెక్టర్ల పరిచయం, కథను ప్రారంభించడంతో పాటు కొన్ని ఎలివేషన్స్ సీన్స్‌తో అద్భుతంగా ఉంటుందట. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీన్స్ మతిపోగొట్టేలా తీర్చిదిద్దారట. ఇక, ద్వితీయార్థం మొత్తం హీరోల మధ్య స్నేహం.. బ్రిటీష్ వాళ్లపై పోరాట ఘట్టాలతో అదిరిపోయేలా ఉందని చెబుతున్నారు.

సినిమాకు ప్లస్‌లు మాత్రమే

సినిమాకు ప్లస్‌లు మాత్రమే

RRR మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఇంటర్వెల్ బ్యాంగ్, సినిమాటోగ్రఫీ, ఫస్టాఫ్ సెకెండాఫ్, రాజమౌళి దర్శకత్వం, నాటు నాటు సాంగ్ ఇందులోని హైలైట్లు అని తెలుస్తోంది. అలాగే, హీరోల పరిచయ సన్నివేశాలు ఇండియాలోనే ఎప్పుడూ చూడనట్లుగా డిజైన్ చేశారని అంటున్నారు.

మొత్తంగా RRR ఎలా ఉంది?

మొత్తంగా RRR ఎలా ఉంది?

ఎన్నో అంచనాలతో RRR మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటి వరకూ చూసిన ట్వీట్ల ప్రకారం.. ఈ సినిమాకు అనుకున్న రేంజ్‌లో కంటే ఇంకా మంచి స్పందన, టాక్ దక్కింది. అన్ని వర్గాల వాళ్లనూ మెప్పించేలా.. ముఖ్యంగా ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కు అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉందట. మొత్తంగా తెలుగు వాళ్లు మీసం తిప్పేలా RRR మూవీ తీశాడట జక్కన్న.

Recommended Video

RRR Review: NTR, Ram Charan కెరీర్‌లో ది బెస్ట్ SS Rajamouli అంకితభావం | Filmibeat Telugu
ఇంతకీ ఏ హీరో రోల్ బాగుంది?

ఇంతకీ ఏ హీరో రోల్ బాగుంది?


రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే సీన్స్ చాలా ఉన్నాయట. వీళ్లిద్దరి మధ్య బాండింగ్ హైలైట్‌గా తీర్చిదిద్దారట. అంతేకాదు, ఫలానా హీరో రోల్ మాత్రమే బాగుంది అని చెప్పేలా కాకుండా.. ఇద్దరికీ సమానమైన స్పేస్ ఇచ్చారట. అలాగే, ఎలివేషన్స్, ఇంట్రో సీన్స్ కూడా దేనికదే అన్నట్లుగా ఉన్నాయట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X