Golden Tomato Award: RRR ఖాతాలో మరో క్రేజీ అవార్డ్.. హాలీవుడ్ చిత్రాలను ఓడించి రికార్డు

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయిందనే చెప్పాలి. దీంతో మరిన్ని భారీ బడ్జెట్ మూవీలు వస్తున్నాయి. ఇలా గత ఏడాది విడుదలైన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ముదులపడంతో పాటు ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించింది.

ఫలితంగా దీనికి ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు RRR మూవీ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకుని రికార్డు సాధించింది. ఆ సంగతులు మీకోసమే!

 టాలీవుడ్ స్టార్లతో అద్భుతం

టాలీవుడ్ స్టార్లతో అద్భుతం

స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఈ క్రేజీ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో కనిపించారు.

 ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్

ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్

RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా చాలా రోజుల పాటు థియేటర్లలో భారీ ప్రభావాన్ని చూపించిదని అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఓటీటీలోనూ ఈ మూవీ అదే దూకుడును ప్రదర్శించింది. ఫలితంగా స్ట్రీమింగ్ చేసిన జీ5, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌లలో రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా దక్కాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతూ హైలైట్ అయింది.

ఎన్నో అవార్డ్స్.. నామినేషన్

ఎన్నో అవార్డ్స్.. నామినేషన్

RRR సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే వరల్డ్ వైడ్‌గా ప్రభావాన్ని చూపించి ఇప్పటికే ఎన్నో కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ అవార్డునూ దక్కించుకుంది. అంతేకాదు, ఆస్కార్‌కు సైతం నామినేట్ అయింది.

RRR ఖాతాలో మరో అవార్డు

RRR ఖాతాలో మరో అవార్డు

ఇప్పటికే ఎన్నో అవార్డులను ఖాతాలో వేసుకున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ తాజాగా మరో దానిని కూడా సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ పాపులర్ రివ్యూ అగ్రిగేటర్ వెబ్‌సైట్ 'రాటెన్ టొమాటోస్' సంస్థ 2022 సంవత్సరానికి గానూ గోల్డెన్ టమాటో అవార్డులను ప్రకటించింది. ఇందులో 2022 ఫ్యాన్ ఫేవరెట్ మూవీగా RRR అవార్డును గెలుచుకుంది.

హాలీవుడ్ చిత్రాలను దాటి

హాలీవుడ్ చిత్రాలను దాటి

ప్రేక్షకుల ఓట్లు ఆధారంగా ఫ్యాన్ ఫేవరెట్ మూవీగా 'గోల్డెన్ టమాటో' అవార్డు RRRకు వచ్చింది. రెండో స్థానంలో 'టాప్ గన్' నిలిచింది. మూడో స్థానంలో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' ఉండగా.. నాలుగో స్థానంలో 'ది బ్యాట్ మ్యాన్' ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దుమ్ముదులిపిన 'అవతార్-2' చిత్రం మాత్రం ఐదో స్థానంతోనే సరిపెట్టుకుంది.

అరుదైన రికార్డును సాధించి

అరుదైన రికార్డును సాధించి

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చి అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమా 'గోల్డెన్ టమాటో' అవార్డును అందుకుని.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగా అరుదైన రికార్డును సాధించినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X