For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mahesh Babu ఆరోగ్యంపై ఎన్టీఆర్ ట్వీట్: కరోనా టైంలో సూపర్ స్టార్‌ను ఆ మాట అనేసిన శ్రీరెడ్డి

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. యాక్టింగ్‌తో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో మాయ చేస్తున్న ఈ స్టార్ హీరో.. ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే మోకాలికి సంబంధించిన సర్జరీని చేయించుకున్నాడు. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న సమయంలో కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. మహేశ్ కోసం స్పెషల్ ట్వీట్ చేశాడు. అలాగే, శ్రీరెడ్డి కూడా ఊహించని కామెంట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  మోకాలికి సర్జరీ.. అక్కడే ఉన్నాడు

  మోకాలికి సర్జరీ.. అక్కడే ఉన్నాడు

  వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న మహేశ్ బాబు.. కొంత కాలంగా మోకాలు సంబంధిత సమస్యతో బాధ పడుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే దానికి సర్జరీ చేయించుకునేందుకు స్పెయిన్ వెళ్లాడు. అక్కడ అది పూర్తైన తర్వాత అతడు దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో ఖాళీ సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడిపాడు.

  జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్

  మహేశ్ బాబుకు కరోనా.. ప్రకటించి

  మహేశ్ బాబుకు కరోనా.. ప్రకటించి

  సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పాడు. అంతేకాదు, తనను కలిసిన వారు కూడా కోవిడ్‌ టెస్ట్‌లు చేసుకోవాలని సూచించాడు.

  మహేశ్ కోలుకోవాలంటూ పోస్టులు

  మహేశ్ కోలుకోవాలంటూ పోస్టులు

  మహేశ్ బాబుకు కరోనా పాజిటివ్ రావడంతో సినీ పరిశ్రమ మొత్తం ఉలిక్కి పడింది. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు, దర్శకులు సహా పలువురు హీరోయిన్లు ట్వీట్లు చేశారు. మిగిలిన చాలా మంది నటులు కూడా పోస్టులు పెడుతున్నారు.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణంగా!

  ఫ్యాన్స్ ఆందోళన.. పూజలు చేస్తూ

  ఫ్యాన్స్ ఆందోళన.. పూజలు చేస్తూ

  తమ అభిమాన నటుడు కరోనా బారిన పడడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా అతడు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు చేసి విష్ చేస్తున్నారు. మరికొందరు అభిమానులైతే గుడికి వెళ్లి మరీ ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు మహేశ్ కోసం చేస్తున్నారు.

  మహేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్

  మహేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్


  సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఎలాంటి సమయంలోనైనా ముందుంటూ పోస్టులు చేస్తుంటాడు. అందుకే ఇప్పుడు అతడికి కరోనా రావడంతో అందరూ ముందుకొచ్చి విష్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ 'నువ్వు త్వరగా కోలుకోవాల మహేశ్ అన్నా. నీకోసం ధైర్యాన్ని, నా ప్రార్థనలను పంపుతున్నా' అని ట్వీట్ చేశాడు.

  Unstoppable with NBK: బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డు.. తెలుగులో నెంబర్ వన్.. ఇండియాలో ఐదో ర్యాంక్

  శ్రీరెడ్డి ఊహించని కామెంట్ చేసి

  శ్రీరెడ్డి ఊహించని కామెంట్ చేసి

  వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా మహేశ్ బాబు ఆరోగ్యంపై స్పందించింది. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో 'మీరు త్వరగా కోలుకోవాలి సూపర్ స్టార్ మహేశ్ బాబు గారు.. జాగ్రత్తగా ఉండండి అన్నయ్య' అంటూ పోస్ట్ చేసింది. ఇందులో ఆమె మహేశ్ బాబును అన్నయ్య అనడంతో అందరూ షాక్ అవుతున్నారు. గతంలో శ్రీరెడ్డి ఏ హీరోనూ ఇలా సంబోధించకపోవడం గమనార్హం.

  మహేశ్ బాబు ఇప్పుడిలా బిజీగా

  మహేశ్ బాబు ఇప్పుడిలా బిజీగా

  మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీని తర్వాత అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తాడు. ఆ తర్వాత రాజమౌళితో ఓ సినిమా చేయనున్నాడు.

  English summary
  Super Star Mahesh Babu Tested Positive for Covid-19 Recently. Now Jr NTR and Sri Reddy Wished Him for Speedy Recovery.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X