»   » మళ్లీ మళ్లీ అదే ప్రశ్నా?.... నాని గురించి నన్ను అడగటం తప్పు: ఎన్టీఆర్

మళ్లీ మళ్లీ అదే ప్రశ్నా?.... నాని గురించి నన్ను అడగటం తప్పు: ఎన్టీఆర్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Jr NTR Press Meet @CELEKT Mobile Launch

  సెలక్ట్ మొబైల్ స్టోర్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బ్రాండ్ ప్రమోట్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన నేపథ్యంలో సీజన్ 2కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా నాని హోస్టింగును యంగ్ టైగర్ అభినందించారు. అదే సమయంలో 'ఎన్టీఆర్ బయోపిక్' విషయంలో అడిగిన ప్రశ్నపై కాస్త సీరియస్ అయ్యారు.

  బిగ్ బాస్ 2 గురించి

  బిగ్ బాస్ 2 గురించి

  బిగ్ బాస్2 చూస్తున్నారా? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ.... చూడటం లేదని తెలిపారు. తనకు అంత సమయం దొరకడం లేదని, తన ఇద్దరు పిల్లలు, షూటింగులతో బిజీగా ఉంటున్నానని తెలిపారు.

  నాని గురించి నన్ను అడగటం తప్పు

  నాని గురించి నన్ను అడగటం తప్పు

  మరో ప్రశ్నకు స్పందిస్తూ.... నాని తప్పకుండా బాగా చేస్తున్నాడని అనుకుంటున్నాను. అతడు గొప్ప నటుడు. ఈ విషయం నన్ను అడగటం తప్పు. బిగ్ బాస్ అనేది ఫెంటాస్టిక్ ఫ్లాట్‌ఫాం. వెరీ సక్సెస్‌ఫుల్ వేదిక. అది ఎవరూ చేసినా గొప్ప జాబ్ అవుతుందని ఎన్టీఆర్ అన్నారు.

  ఫోన్ లేకుండా ఉండటం కష్టం

  ఫోన్ లేకుండా ఉండటం కష్టం

  మొబైల్స్ వచ్చినప్పటి నుండి అది లేకుండా ఇప్పటి వరకు లేను. అందులో ఉండే ఫీచర్స్ వాడక పోయినా మాట్లాడుకోవడానికైనా ఫోన్ ఉండాలి. ఇపుడు నాకు ఇద్దరు పిల్లలు. వారి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఫోన్ అవసరం.

  మూడు నెలలు డిజిటల్ డీటాక్స్ ట్రై చేయాలని ఉంది

  మూడు నెలలు డిజిటల్ డీటాక్స్ ట్రై చేయాలని ఉంది

  ఈ మధ్యే అనుకున్నాను డిజిటల్ డీటాక్స్ మూడు నెలలుట్రై చేయాలని, కానీ మూడు నెలల పాటు ఫోన్ లేకుండా ఉండటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. అందులో ఉన్న ఫీచర్స్ వాడకుండా మూడు నెలల పాటు డిజిటల్ డీటాక్స్ తీసుకుందామనే ఆలోచన అయితే ఉంది. అది ఎప్పటికి కుదురుతుందో తెలియదు. ఇప్పటి వరకైతే చాలా తక్కువ సందర్భాల్లో మొబైల్ లేకుండా ఉన్నాను... అని ఎన్టీఆర్ తెలిపారు.

  ఎన్టీఆర్ బయోపిక్‌లో ఉన్నారా? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ అసంతృప్తి

  ఎన్టీఆర్ బయోపిక్‌లో ఉన్నారా? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ అసంతృప్తి

  ఎన్టీఆర్ బయోపిక్‌లో ఉన్నారా? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ అసంతృప్తిగా సమాధానం ఇచ్చారు. నేను ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా ఇదే ప్రశ్న అడుగుతారా? గతంలో ఐపీఎల్ ప్రమోషనల్ ఈవెంటులో పాల్గొన్నపుడు అడిగితే సమాధానం చెప్పాను. అందుకే దీనికి మరోసారి సమాధానం చెప్పదలుచుకోలేదు. దీనికి మీకు సమాధానం కావాలంటే వెనక్కి వెళ్లి ఆ ఇంటర్వ్యూ చూడండి... అంటూ ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు.

  ‘సెలక్ట్' మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది

  ‘సెలక్ట్' మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది

  మనం ఏదైనా కొనడానికి వెళ్లినపుడు ఏదో కొన్నాం, వచ్చాం కాకుండా..... ఆ స్టోర్ గురించి మనతో మిగిలిపోయేది ఎక్స్‌పీరియన్స్ కూడా ఒకటి ఉంటుంది. అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఈ స్టోర్ ఇవ్వడం బాగా నచ్చింది. కేవలం వస్తువు అమ్మేసి బిల్ చేసి పంపించకుండా కస్టమర్లలో ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు...అని ఎన్టీఆర్ తెలిపారు.

  English summary
  Jr NTR Appriciates Nani's Hosting In Bigg Boss 2 at celekt Mobile Launch event. Tollywood Young Tiger Jr NTR has turned a brand ambassador for CELEKT Mobiles. While gracing the official announcement press meet this evening at ITC Kohenur in HiTech City. Hyderabad, the actor has interacted with media questions.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more