శ్రీకృష్ణుడు గెటప్ లో జూ.ఎన్టీఆర్ కేక పెట్టించనున్నాడా?
ఎన్టీఆర్...శ్రీకృష్ణుడు గెటప్ లో కనపడితే ఆంధ్రా అంతటా పటాలు కట్టించుకుని ఇంట్లో పెట్టుకుని కళ్ళకద్దుకున్నారు. ఇప్పుడు అదే ఫీట్ ని జూ.ఎన్టీఆర్ రిపీట్ చేయనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రం బృందావనంలో జూ ఎన్టీఆర్...శ్రీకృష్ణుడుగా కనిపించి అలరించనున్నారు. ఉండేది కాస్సేపే అయినా ఈ సీన్స్ సినిమా మొత్తానికి హైలెట్ అవుతాయని భావిస్తున్నారు. యమదొంగలో యముడు గెటప్ కి వచ్చిన రెస్పాన్స్ రేంజిలో ఈ శ్రీకృష్ణుడుకి కూడా వస్తుందని భావిస్తున్నారు. కాజల్, సమంత హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ గోవిందుడు అందరి వాడేలే. దానికి తగినట్లుగానే ఇద్దరి హీరోయిన్స్ మధ్యన నలిగే హీరోగా కనపించి నవ్విస్తాడు ఎన్టీఆర్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఇక ఎన్టీఆర్ పాటలు కోసం ఎబ్రాడ్ వెళ్ళనున్నారు. అక్కడ నుంచి వచ్చాక ఈ శ్రీకృష్ణ పరమాత్మ గెటప్ షూటింగ్ జరగనుంది.


Click it and Unblock the Notifications











