ఎమ్మెల్యే కాబోతున్న జూ ఎన్టీఆర్!
హారిష్ శంకర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎమ్మెల్యేగా దర్శనం ఇవ్వబోతున్నారట. ఎమ్మెల్యే అంటే కొంపతీసి...అసెంబ్లీ మెంబర్ అనుకునేరు, ఈ సినిమాలో ఎమ్మెల్యే పదానికి 'Manchi Lakshanalunna Abbayi" అని మీనింగ్ వస్తుందట.
అయితే ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. బహుషా ఈ సినిమా 2012 సంవత్సరంలో సెట్స్ మీదనకు వచ్చే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులైన టీడీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వరకు వీరు జూనియర్ తో అదుర్స్ సినిమా రూపొందించారు. ప్రస్తుతం జనియర్ ఎన్టీఆర్ బోయపాటి దర్శకత్వంలో 'దమ్ము" సినిమా చేస్తుండగా, హారిష్ శంకర్ వపన్ కళ్యాన్ తో గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.


Click it and Unblock the Notifications











