సుకుమార్ దర్శకత్వంలో ఫ్లాప్‌కు కూడా ఓ రెస్పెక్ట్: ఎన్టీఆర్
హైదరాబాద్: సుకుమార్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్'. రాజ్‌తరుణ్, హేభాపటేల్ జంటగా నటిస్తున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్, పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను శుక్రవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విడుదల చేశారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ ``ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే కారణాలు చాలా ఉంటాయి. దర్శకుడు అలా చేయాలనుకున్నాడు, చేయలేకపోయాడు. ఇలా చేయాలనుకున్నాడు అనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఫ్లాప్ కు కూడా ఓ రెస్పక్ట్ ఉంటుంది. అందుకు కారణం ఆయన సినిమాలు అలా ఉండటమే. ఈ సినిమా టీజర్‌ను చిన్న ప్లేస్‌లో తెరకెక్కించారు. కానీ చూడ్డానికి వండర్‌ఫుల్‌గా ఉంది. రాజ్‌తరుణ్ సినిమా ఉయ్యాల జంపాలను మా ఆవిడ చూడమంటే చూశాను. తన ఎదుగుదలకు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. దేవిశ్రీప్రసాద్, రత్నవేలు గురించి ఎంతైనా చెప్పొచ్చు. ఈ సినిమా దర్శకుడు నాతో సుబ్బు చిత్రానికి పనిచేశాడు`` అని అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ``రాజ్‌తరుణ్ నిజానికి అప్ కమింగ్ హీరో. ఈ సినిమాతో అతనికి తప్పకుండా మంచి బ్రేక్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. సుకుమార్, నేనూ కలిసి చేస్తామంటే తప్పకుండా క్రేజ్ ఉంటుంది. ఇది కూడా చాలా మంచి సినిమా అవుతుంది. ఎన్టీఆర్ ఈ చిన్న సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అది గొప్ప విషయం. కరెంటు సినిమాకు నేను ఈ దర్శకుడితో పనిచేశాను. ఆ పాటలు పెద్ద హిట్ అయ్యాయి`` అని అన్నారు.

దర్శకుడు
దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ `సుకుమార్ గారు నాకు చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని అన్నీ నేర్పించినంత ఓపికగా నాకు నేర్పించాడు. నా స్థాయికి మించిన టెక్నీషియన్లను నాకు ఇచ్చారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల ఆయన చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంది. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ ఇది`` అని అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ
ఈ కథ నన్ను ఆరేళ్ళుగా వెంటాడుతోంది. ఒక లైనుతో ఏడాది క్రితం కథ చేశాం. ప్రతాప్‌కి చెప్పి డెవలప్ చేసుకున్నాం. నేను, దేవి, రత్నవేలు కలిసి చేస్తున్నాం. మేం ఏం చేశామన్నది, వారు నాకు ఎలా సహకరించారన్నది ఆడియో వేడుకలో చెబుతాను అన్నారు.

అమ్మాయిల ఫాలోయింగ్
ఈ స్క్రిప్ట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు రాజ్ తరుణ్ తానే ఈ పాత్రను చేస్తానని చెప్పేశాడు. నేను కాస్త డౌట్ పడ్డాను కానీ మా వాళ్ళందరూ అతను యాప్ట్ అని అన్నారు. హీరోయిన్‌గా ముందు వేరే అమ్మాయిని అనుకున్నాం. కానీ ఈ అమ్మాయి చాలా బాగాచేసింది. రాజ్ తరుణ్‌కి ఈ సినిమా తర్వాత అమ్మాయిల ఫాలోయింగ్ పెరుగుతుంది అన్నారు సుకుమార్.

కుమారి 21 ఎఫ్
సుకుమార్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్'. రాజ్‌తరుణ్, హేభాపటేల్ జంటగా నటిస్తున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్, పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











