డబ్బుల్ని వెనకేసుకోవడానికి కాదు...ఎన్టీఆర్
డబ్బుల్ని వెనకేసుకోవడానికి ఈ తరహా కార్యక్రమాలు చేయట్లేదు. కళాకారులను ఆదుకోవడం కోసమే చేస్తున్నాం అని ఎన్టీఆర్ అన్నారు. అదుర్స్ చిత్రంలో చారి పాత్ర ధరించిన కోటు, హ్యాటులను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇటీవల వేలం వేసింది. మురళి రావి కోటును, పవన్ కుమార్ ముమ్మనేని హ్యాట్‌ను శనివారం సాయంత్రం ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ...పై విధంగా చెప్పుకొచ్చారు. అలాగే...వేలాన్ని ప్రకటించిన వెంటనే ముందుకొచ్చిన అభిమానులందరికీ అభినందనలు. అభిమానులు తమ అభిమానాన్ని మంచి పనుల రూపంలో చూపిస్తే చాలా సంతోషిస్తామని ఎన్టీఆర్ అన్నారు. ఇక పేదకళాకారులకు సాయం చేయడం కోసం..మరేదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు నిబ్బరంగా ఉండటానికే అందుబాటులో కొంత మొత్తాన్ని ఉంచుకోవడం శ్రేయస్కరమని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మురళీమోహన్ చెప్పినప్పుడు సబబనిపించింది. వెంటనే 'అదుర్స్'లో చారి ధరించిన కోటు, హ్యాటు వేలానికి సంబంధించి అంగీకారాన్ని తెలిపాను అన్నారు. ఇతరులకు సాయం చేయడంలో తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ ఉన్నారని ఏవీయస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వల్లభనేని వంశీ మోహన్, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), కోన వెంకట్, హేమ, బెంగుళూరు పద్మ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











