లక్ష్మీ ప్రణతి బర్త్ డే లో రెచ్చిపోయిన జూ ఎన్టీఆర్!
ఎన్టీఆర్ కు నార్నేశ్రీనివాసరావు తనయ లక్ష్మీప్రణతికి వివాహం జరగబోతోందనే వార్తలు తెలిసినవే. మొన్న శుక్రవారం(25.03.10)న తనకు కాబోయే భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుకల్లో ఎన్టీఆర్ సందడి చేసాడట. రాత్రి 9.30 కు నార్నే ఇంటికి వెళ్ళిన ఎన్టీఆర్ దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉండి తనకు కాబోయే భార్య లక్ష్మీప్రణతితో ముచ్చట్లు చెప్పాడని, ఆమె బర్త్ డే కేక్ ను పంచుకున్నాడని సమాచారమ్.
అయితే లక్ష్మీప్రణతి తో ఎన్టీఆక్ వివాహం నవంబర్ నెలలో జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా ఎన్టీఆర్ స్వయంగా మీడియా సమావేశం ఏర్సాటు చేసి తన పెళ్ళి వార్తను ప్రకటించాలనుకుంటున్నాడని సమాచారం. ఈ సందర్బంగా ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటుడు తన పెళ్ళి వార్త చెబుతాడా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారని సమాచారం.
ఇక ప్రస్తుతం జూ ఎన్టీఆర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న'శక్తి" చిత్రంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'బృందావనం" సినిమా షూటింగులతో బిజిగా వున్నాడు.


Click it and Unblock the Notifications











