For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘బాద్‌ షా’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: భారీ అంచనాలతో విడుదలైన జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల చిత్రం 'బాద్‌ షా' చిత్రం శుక్రవారం విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించింది. సినిమాపై మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్నంటే రేంజిలో ఉండటం, సినిమా విడుదలయ్యాక కూడా ఎంటర్టెన్మెంట్ మూవీ అని పాజిటివ్ టాక్ రావడం మరింత కలిసొచ్చింది. కలెక్షన్ల విషయంలో తప్పకుండా సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ఈచిత్రం విడుదలై అన్ని చోట్లా తొలి రోజు 100% ఆక్యుపెన్సీ సాధించాయి. సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలు కావడంతో తొలి వీకెండ్ (శుక్ర, శని, ఆది) టికెట్లన్నీ ముందుగానే బుక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా తొలి 3 రోజుల కలెక్షన్స్ భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

    చాలా చోట్ల అభిమానులు టికెట్స్ దొరకక నిరాశ పడ్డారు. ఇదే అదునుగా బ్లాక్ టికెట్ అమ్మకం జోరుగా సాగింది. తొలి రోజు షో చూడాలనే ఆత్రుతతో కొందరు అభిమానులు రూ. 1000 వరకు వెచ్చించి టికెట్స్ కొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సినిమా ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెన్మెంట్ తో నిండి ఉండటంతో అభిమానులంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

    మరో వైపు ఈ సినిమా కలెక్షన్ల గురించి ట్రేడ్ పండిట్స్ లెక్కలు వేయడం ప్రారంభించారు. తొలి రోజు భారీగా థియేటర్లు కేటాయించడంతో సినిమా తొలి రోజు రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ సాధిస్తుందని అంచనా అంచనా వేస్తున్నారు. గబ్బర్ సింగ్ రికార్డులు కూడా తుడిచి పెట్టుకుపోయే అవకాశం ఉందనే వాదన కూడా ఉంది. చూద్దాం... ఏం జరుగుతుందో!

    English summary
    Srinu Vytla's most-anticipated Telugu movie Baadshah, which has hit the screens across the globe today, has opened to an earth-shattering response at the Box Office in Andhra Pradesh and around the world. NTR mania is at its peak at the collection centres. Trade experts say that this masala action entertainer is sure to erase all previous records at the Box Office on the first day and it will set its own new benchmark.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X