జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఫైట్స్ బ్యాంకాక్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం 'బాద్ షా'. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం తర్వాతి షెడ్యూల్ బ్యాంకాక్‌లో ప్లాన్ చేస్తున్నారు.
ఆగస్టు 8 నుంచి జరిగే బ్యాంకాక్ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఎన్టీఆర్ ఇందులో మునుపెన్నడూ లేని విధంగా కొత్త లుక్‌తో కనిపించనున్నారు.
శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. డిసెంబర్ కల్లా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి. అదే నెలలో ఆడియో విడుదల కానుంది.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











