ఆట మొదలెట్టిన జూ ఎన్టీఆర్!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఆట మొదలెట్టారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇటలీలో నిన్న(జూలై 13) అఫీషియల్‌గా ప్రారంభం అయింది. ఈ చిత్రం గురించి వివరాలను రచయిత గోపీ మోహన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'శ్రీను వైట్లకు, జూ ఎన్టీఆర్, బాద్ షా టీంకు నా శుభాకాంక్షలు. ఈ రోజు మిలన్(ఇటలీ)లో షూటింగ్ ప్రారంభం అయింది. నా ఫేవరేట్ సీన్స్ జూ ఎన్టీఆర్, కాజల్‌పై చిత్రీకరిస్తున్నారు' అంటూ ట్వీట్ చేశారు. మరో 25 రోజుల పాటు ఇటలీలోనే షూటింగ్ జరుగనుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ చేసే యాక్షన్ సీన్లు ఓరేంజిలో ఉంటాయని...పంచ్ డైలాగులు అదిరిపోయేలా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యుల నుంచి వినిపిస్తున్న మాట. తమన్ మరోసారి హిట్ మ్యూజిక్ అందించేందుకు కసరత్తు చేస్తున్నారు.
దూకుడు చిత్రంతో తన రేంజిని మరింత పెంచుకున్న దర్శకుడు శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టును రెడీ చేసుకున్నారు. రొటీన్ సీన్లు కాకుండా ఈ సారి సరికొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మరి ప్రేక్షకులకు ఈ చిత్రం ఎలాంటి అనుభూతినిస్తుందో...!


Click it and Unblock the Notifications











