Puneeth Rajkumar: పునీత్‌ను చూసి తల బాదుకొంటూ బాలకృష్ణ కంటతడి.. అంత్యక్రియలకు ఎన్టీఆర్‌తో ఎవరు హాజరయ్యారంటే?
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చిన్న వయసులోనే సత్తా చాటి.. సుదీర్ఘ కాలంగా బడా హీరోగా వెలుగొందుతోన్న పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పేరుకు శాండిల్‌వుడ్ హీరోనే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకోవడంతో ఆయన మరణం వార్త అందరినీ కలచి వేస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా పునీత్ ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పునీత్‌ను కడసారి చూసేందుకు చాలా మంది ప్రముఖులు బెంగళూరు పయనం అవుతున్నారు. ఎవరెవరు అక్కడకు వెళ్తున్నారంటే!

హార్ట్ ఎటాక్‌తో పునీత్ కన్నుమూత
ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టే పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్లు చేసే సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతడిని అక్కడి సిబ్బంది బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్సను అందించే ప్రయత్నం చేశారు. కానీ, అవేమీ ఫలించకపోవడంతో పునీత్ ఆ వెంటనే కన్నుమూశాడు.

సినీ కుటుంబంలో విషాదం.. పోస్ట్
దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త సినీ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో దక్షిణాదికి సంబంధించిన హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు.. మిగిలిన పరిశ్రమల వాళ్లు కూడా పునీత్‌కు సంతాపం తెలుపుతున్నారు. తమ గుండె ముక్కలైందని చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అలాగే, అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు.

ఫ్యాన్స్ ఆర్తనాదాలు.. దారుణంగా
పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్తను అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. నిన్న విక్రమ్ ఆస్పత్రి దగ్గరకు.. ఇప్పుడు అతడి పార్థీవ దేహాన్ని ఉంచిన కంఠీరవ స్టేడియం దగ్గరకు ఫ్యాన్స్ అందరూ తండోపతండాల తరలి వస్తున్నారు. అక్కడ చాలా మంది గుండెలదిరేలా రోదిస్తున్నారు. ఇప్పటికే ఈ వార్తను తెలిసిన పలువురు అభిమానులు షాక్‌తో ప్రాణాలను కూడా కోల్పోయారు.

ఇప్పటికే చేరుకున్న ప్రముఖులు
పునీత్ రాజ్‌కుమార్ మరణంతో కన్నడ సినీ ఇండస్ట్రీలో పెను విషాదం అలముకుంది. ఈ నేపథ్యంలో అక్కడి స్టార్లతో పాటు మిగిలిన నటీనటులు అందరూ కంఠీరవ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఆ ఇండస్ట్రీనే కాదు.. దక్షిణాదిలోని తమిళం, మలయాళం, తెలుగు సినీ పరిశ్రమల నటులు కూడా పునీత్‌ను కడసారి చూసేందుకు బెంగళూరు చేరుకుంటున్నారు.

తెలుగులోకి ఎంట్రీ.. వాళ్లు క్లోజ్‌గా
పునీత్ రాజ్‌కుమార్‌కు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. మరీ ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అలాగే, డబ్బింగ్ సినిమాలతో అతడు కొంత మందికి పరిచయం ఉన్నాడు. ఈ ఏడాది వచ్చిన 'యువరత్న' అనే సినిమాతో తెలుగు వాళ్లకు బాగా సుపరిచితుడు అయ్యాడు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది.

పునీత్ కోసం ఎన్టీఆర్, బాలయ్య
పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జరుగుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి బాలకృష్ణ అక్కడకు చేరుకున్నారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఒక సందర్భంలో తలబాదుకుంటూ ఏడ్చేశారు. అనంతరం పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. తర్వాత అక్కడే ఉన్న శివ రాజ్‌కుమార్‌ను ఆయన ఓదార్చారు. ఇక, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవిలు మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు వెళ్తున్నారని తెలిసింది.

బెంగళూరు ఎవరెవరు వెళ్తున్నారు?
తాజా సమాచారం ప్రకారం.. సీనియర్ నటుడు నరేష్, శివ బాలాజీ సహా పలువురు మా సభ్యులు ఇప్పటికే బెంగళూరు పయనం అయ్యారు. అలాగే, మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు, అక్కినేని ఫ్యామిలీ నుంచి పలువురు నటులు, కొందరు మెగా హీరోలతో పాటు రాజ్‌కుమార్ కుటుంబంతో సంబంధం ఉన్న కొందరు అక్కడకు వెళ్లబోతున్నారనే సమాచారం తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











