దగ్గరవుతున్నారు: బాలయ్యను కలవబోతున్న ఎన్టీఆర్
హైదరాబాద్: గత కొన్ని రోజుల క్రితం పరిస్థితి పరిశీలిస్తే.....నందమూరి హీరోలైన బాలకృష్ణ, జూ ఎన్టీఆర్ మధ్య దూరంగా కాస్త పోరిగినట్లు ఉండేది. అయితే ఇపుడంతా సర్దుకుందని, నందమూరి ఫ్యామిలీ హీరోలంతా ఏకమయ్యారని తాజా పరిణామాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. త్వరలో ఎన్టీఆర్, బాలయ్య కలుసుకోబోతున్నారు కూడా.
ఇటీవల మేము సైతం కార్యక్రమంలో జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ బాబాయ్ బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్' ఆడియో వేడుక డిసెంబర్ 7న శిల్పకళా వేదికలో జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ పరిణామాలు నందమూరి అభిమానుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి.

కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం'పటాస్'. రచయిత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ పోలీసు అధికారిగా కనిపిస్తారు. ఈ ఫస్ట్ లుక్ డిఫెరెంట్ గా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. కందిరీగ, ఆగడు సినిమాలకు రైటర్ గా పనిచేసిన అనిల్ రవిపూడి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పటాస్ అనేదే మాస్ టైటిల్, అలాంటి ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కళ్యాణ్ రామ్ ఫూర్తి రఫ్ లుక్ లోకనిపించనున్నారు. కళ్యాణ్ రామ్ నిర్నిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇందులో హీరోయిన్ గా శ్రుతి సోధి నటిస్తోంది. పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. సాయికుమార్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











