Anchor Suma మితిమీరిన ఓవరాక్షన్.. దిమ్మ తిరిగేలా షాకిచ్చిన జూనియర్ ఎన్టీఆర్

తెలుగు వినోద పరిశ్రమలో సుమ ఎక్కని సినిమా వేదిక లేదు. ఆమె చేయని షోలు టెలివిజన్‌లో లేదంటే అతిశయోక్తిగా ఉంటుందేమో. పుట్టకతో మలయాళీ అయినా తెలుగు భాషపై పట్టు సాధించి.. వేదికలపై సమయస్పూర్తిని ప్రదర్శించే యాంకర్ సుమ తెలుగు ప్రేక్షకుల్ల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నది. టాప్ యాంకర్‌గా, హోస్ట్‌గా, అప్పడప్పుడు నటిగా తెర మీద తన ప్రతిభను చాటుకొంటున్నారు.

అయితే ఇలాంటి ప్రతిభాపాటవాలు ఉన్న యాంకర్ సుమ వేదికలపై అత్యుత్సాహం, అలాగే నోటి దురుసును ఎక్కువగా ప్రదర్శిస్తున్నారనే మాట సినీ, మీడియా వర్గాల్లో ఎక్కువగానే వినిపిస్తుంది. తాజాగా అమీగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె నోటి దురుసుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నించడంతో ఆమె వ్యవహారం చర్చనీయాంశమవుతున్నది. యాంకర్ సుమ వ్యవహార తీరు విషయానికి వస్తే..

టాప్ యాంకర్‌గా సుమ

టాప్ యాంకర్‌గా సుమ

టాలీవుడ్‌లో ఎలాంటి ఫంక్షన్ నిర్వహించాలంటే యాంకర్ సుమ పేరు గుర్తుకు వస్తుంది. ఫంక్షన్‌కు తగినట్టుగా తన హావభావాలు ప్రదర్శించడంలోను, గెటప్ వేసుకొని ఆ ఈవెంట్‌ను నడిపించడంలోను సుమ స్టైలే వేరు ఉంటుంది.

అయితే ఈవెంట్‌ను నిర్వహించేందుకు సుమకు టాప్ రేంజ్‌లో రెమ్యునరేషన్ (జీఎస్టీ)తో సహా ముడుతుంది. కొంతకాలం సుమ ఈవెంట్లను నిర్వహించిన తీరు అందర్నీ ఆకట్టుకొన్నదనడంలో ఎలాంటి సందేహం లేదు.

కాంట్రవర్సియల్‌గా, నోటిదురుసుతో

కాంట్రవర్సియల్‌గా, నోటిదురుసుతో

అయితే ఇటీవల కాలంలో వేదికలపై కొన్నిసార్లు కాంట్రవర్సియల్‌గా మాటలు జారడం.. అలాగే చిన్న చిన్న నటులపై మాటలు విరవడం, అలాగే సెటైర్లు వేయడం లాంటి ఎక్కువగానే కనిపించాయి.

ఇక బ్రహ్మాజీ ఉన్నారంటే.. వేదికపై పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయం పట్టించుకోకుండా కామెంట్లు విసరడం వేదిక కింద ఉన్నవారికి కూడా ఇబ్బంది కలిగించే సంఘటనలు ఉన్నాయి. ఇలా ఆమె అసహనం, అసంతృప్తి పెరుగుతూ వస్తున్న సమయంలో సుమపై ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

సుమపై ఎన్టీఆర్ అసహనం

సుమపై ఎన్టీఆర్ అసహనం

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఎప్పటిలానే సుమ తన వాక్చాతుర్యంతో ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారు. యధావిధిగా బ్రహ్మాజీని స్టేజీపై ఆడేసుకొన్నది. ఆ తర్వాత ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చే సమయానికి కొరటాల శివ రూపొందించే ఎన్టీఆర్30 సినిమాపై అప్‌డేట్ ఇవ్వబోతున్నాడనే విషయంపై సుమ అత్యుత్సాహం ప్రదర్శించింది. దాంతో ఎన్టీఆర్ స్టేజీపై తీవ్ర అసహనానికి గురయ్యాడు.

నీవే చెప్పేలా ఉన్నావు అంటూ

సుమ మాటలతో ఇబ్బందిపడిన ఎన్టీఆర్‌ను కల్యాణ్ రామ్ చూసి నవ్వాడు. దాంతో కోపంగా కల్యాణ్ రామ్‌ను, చూస్తూ కళ్లతో వాళ్లు ఏవో సైగలు చేసుకొని సర్ది చెప్పుకొన్నారు. ఎన్టీఆర్30 యంగ్ టైగర్ అప్‌డేట్ ఇస్తారని సుమ అరుస్తుంటే.. మైక్ అందుకొంటూ వాళ్లు అడగకున్నా.. నీవు చెప్పేలా ఉన్నావు అంటూ కోపంగా సుమను ఎన్టీఆర్ మందలించే ప్రయత్నం చేశారు.

నిర్మాత, దర్శకులపై ఒత్తిడి అంటూ

నిర్మాత, దర్శకులపై ఒత్తిడి అంటూ

అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అప్‌డేట్ అప్‌డేట్ అంటూంటే.. మీ ఆత్రుత అర్ధమవుతుంది. ఇలా అడగడం వల్ల ప్రొడ్యూసర్, డైరెక్టర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అప్‌డేట్ అంటే ఏదో ఒకటి చెప్పలేరు. అదిరిపోయే అప్‌డేట్ ఉంటే చెబుతాం. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ నెంబర్ వన్ స్థానంలో ఉంది. సినిమా తీయాలంటే.. చాలా చాలా ఫోకస్ చేయాలి. ఏదైనా అప్‌డేట్ ఉంటే.. నా భార్య కంటే ముందే మీకు చెబుతాను అని సుమకు గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

NTR30 యంగ్ టైగర్ అప్‌డేట్

NTR30 యంగ్ టైగర్ అప్‌డేట్

అప్‌డేట్ ఇవ్వాలంటే మంచి సమయం, సందర్భం ఉండాలి. అమీగోస్ సినిమా సందర్భంగా NTR30 మూవీ గురించి అప్‌డేట్ ఇస్తున్నాను. ఫిబ్రవరిలో సినిమాను ప్రారంభిస్తాం. మార్చి 20 నుంచి షూటింగ్ మొదలుపెడుతాం. 2024 ఏప్రిల్ 5 తేదీన ఆ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. ఆఖరిగా ఒక్కమాట అందరూ జాగ్రత్తగా ఇంటి వద్ద మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు. వారి కోసం జాగ్రత్తగా వెళ్లండి అంటూ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X