జూ ఎన్టీఆర్ తెలంగాణ బిడ్డే.. మర్చిపోవద్దు
జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి బాలనటుడిగా రాణించి హీరో అయ్యారని ఆ విషయం తెలిసి కూడా ముఖ్యమంత్రి రోశయ్య ఇటీవల సినీ కళాకారుల గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ను విస్మరించడం విడ్డూరంగా ఉందనీ తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎల్.శ్రీనాధ్ (కుబుసం ఫేమ్) విమర్శించారు.ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారంనాడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం ప్రస్ధావించారు. తెలంగాణకు చెందిన వారంటూ చెప్పిన లిస్టులో ఎన్టీఆర్ పేరును ముఖ్యమంత్రి ప్రస్తావించకపోవడం ఆయనను తెలంగాణకు దూరం చేయడమే అవుతుందని అన్నారు. అలాగే సినిమాలకూ రాజకీయాలకూ ఎంత మాత్రం సంబంధం లేదని అన్నారు. అంతేగాక సినీ షూటింగ్ లపై జరిగిన దాడులను ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే దాడులకు దారితీసిన పరిస్థితులపై విశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో నటుడు సివిఎల్ నర్సింహారావు కూడా పాల్గొన్నారు.ఇక కొద్దిరోజుల క్రిందట ఎన్టీఆర్ ..బృందావనం చిత్రంపై తెలంగాణా వాదులు దాడికి పూనుకుని దర్శక,నిర్మాతల చేత జై తెలంగాణ అనిపించి వదిలివేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











