Jr NTR: జూ. ఎన్టీఆర్ భారీ స్కెచ్.. ఫ్యాన్స్‌తో భేటీకి భారీ సమావేశం!

RRR, దేవర సినిమాల విజయాలతో కెరీర్ పరంగా మంచి జోష్ మీద ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొద్దికాలంగా తన అభిమానించే ఫ్యాన్స్‌ను కలుసుకోలేకపోయారు. తన అభిమానులను కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ గందరగోళంగా మారి రద్దు కావడంతో ఆ అవకాశాన్ని మిస్ అయ్యారు. దాంతో అభిమానులకు, యంగ్ టైగర్‌కు మధ్య చిన్న గ్యాప్ పెరిగింది. అయితే ఎన్టీఆర్‌ను కలుసుకోవడానికి అభిమానులు ప్రయత్నాలు చేయడాన్ని గమనించిన ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఆ నిర్ణయం వివరాల్లోకి వెళితే..

జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన ప్రత్యేక ప్రకటన మీడియాలో ఆసక్తిని మాత్రమే కాకుండా కొన్ని సందేహాలను కూడా వెంటనే రేకెత్తించింది. అయితే కారణాలు ఏవైనా ఉన్నప్పటికీ.. తారక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నాపై చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఆ ప్రకటనలో తెలిపారు.

Jr NTR big plan to meet Nandmuri Fans and Well Wishers very soon in Hyderabad Here is the details

నన్ను కలుసుకోవడానికి అభిమానులు ఎదురు చూస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. వారి ఆసక్తిని అర్ధం చేసుకొన్నాను. అందుకే త్వరలోనే సజావుగా ఏ మీటింగ్ ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా కలువాలని నిర్ణయించుకొన్నాను. ఆ సమావేశం కోసం పోలీస్ డిపార్ట్‌మెంట్ అనుమతులు, ఇతర అధికారులతో సమన్వయం చేస్తున్నాం అని తన ప్రకటనలో వెల్లడించారు.

అభిమానులతో జరిగే భేటి వల్ల ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ఫ్యాన్స్‌ను కలువడానికి ఏర్పాటు చేసే భారీ సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరమవుతుంది. కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నాం. అప్పటి వరకు సహనంతో ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అని ఎన్టీఆర్ పీఆర్ వర్గాల ద్వారా లేఖను విడుదల చేశారు.

Jr NTR big plan to meet Nandmuri Fans and Well Wishers very soon in Hyderabad Here is the details

అయితే ఈ సమావేశానికి ముందు నన్ను కలుసుకోవడానికి ఎలాంటి పాదయాత్ర చేయకూడదు. మీ ఆనందం మాత్రమే కాదు.. మీ భద్రత, సంక్షేమం కూడా నాకు అత్యంత ప్రధానం. కాబట్టి అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ తన అభిమానులను కోరారు.

ఇదిలా ఉండగా, అభిమానులతో భేటీకి సంబంధించిన ప్రకటన మీడియాలోను, రాజకీయ వర్గాల్లోను భారీ చర్చకు తెరలేపింది. అయితే గత కొద్దికాలంగా నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్‌ నేపథ్యంలో అభిమానులకు ఏదైనా దిశానిర్దేశం చేస్తారా? అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఈ భేటి జరిగితే కానీ ఎన్టీఆర్ మనసులో ఉన్న భావం ఏమిటో బయటపడదని అంటున్నారు విశ్లేషకులు.

More from Filmibeat

Read more about: jr ntr devara tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X