Komaram Bheem Look From RRR: హై వోల్టేజ్ లుక్.. చేతిలో బల్లెంతో జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ పోస్టర్!
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పుట్టినరోజు కానుకగా మొత్తానికి పవర్ఫుల్ RRR లుక్ ను వదిలారు. ఇదివరకే సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్స్ వచ్చినప్పటికీ ఈ పోస్టర్ మాత్రం మరో లెవెల్ లో ఉంది. దీని కోసమే గత కొన్ని రోజులుగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగెస్ట్ మల్టీస్టారర్ పావు అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
హాట్ బాంబ్ రాఖీ సావంత్.. ఆ చబ్బీ అందాలు డోస్ తగ్గలేదు

నందమూరి స్థాయి పెరిగేలా..
నేడు జూనియర్ ఎన్టీఆర్ 38 వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల కెరీర్ లో తారక్ ఎంతో క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. అభిమానుల ప్రేమను మరింత రెట్టింపు చేసి నందమూరి స్థాయిని సైతం మరో లెవెల్ కు తీసుకు వెళ్ళాడు. ఇక అందరి చూపు ఇప్పుడు RRR పైనే ఉంది.

ఆలస్యంగానే..
ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ విడుదల కానున్నట్లు ఒకరోజు ముందుగానే క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్ ఎప్పటిలానే ఆలస్యంగా విడుదల చేసింది. ఉదయం 10గంటల నుంచి అభిమానులు ఎదురుచూస్తుండగా.. దాదాపు 10 నిమిషాలు ఆలస్యంగా విడుదల చేశారు.

చేతిలో బల్లెంతో ఎన్టీఆర్
ఇక మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ హై వోల్టేజ్ లుక్కుతో అదరగొట్టేసాడు. సినిమాలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక చేతిలో బల్లెం పట్టుకొని కనువిందు చేశాడు. రాజమౌళి మరోసారి ఈజీగా ప్రమోషన్ డోస్ పెంచేశాడు. బాక్సాఫీస్ కటౌట్ అదిరింది అని అభిమానులు కామెంట్స్ తో రచ్చ మొదలట్టేశారు.
Recommended Video

వేడుకలకు దూరంగా ఉండాలని
జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది ఎలాగైతే జాగ్రత్తలు చెప్పాడో ఈసారి కూడా అలానే వేడుకలకు దూరంగా ఉండాలని చెబుతూ ఈ కరోనా కష్ట సమయంలో వీలైతే తోటి వారికి సహాయం చేయాలని వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకోవద్దని మీరు జాగ్రత్తగా ఉండి ఇంట్లో వాళ్ళను జాగ్రత్తగా ఉంచాలని కోరాడు.


Click it and Unblock the Notifications











