NTR31: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. పుట్టినరోజు మరొక బిగ్గెస్ట్ అప్డేట్!
మే 20కోసంనందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గత ఎడాది కరోనా కారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. అందుకే ఈసారి ఎలాగైనా అంతకు మించి అనేలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఈసారి కరోనా సెకండ్ వేవ్ మరింత ఎక్కువవవ్వడం వలన నిరాశే ఎదురయ్యింది. ఇక పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ నుంచి రెండు స్పెషల్ అప్డేట్స్ రాబోతున్నాయి.

వేడుకలకు దూరంగా ఉండాలని
జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది ఎలాగైతే జాగ్రత్తలు చెప్పాడో ఈసారి కూడా అలానే వేడుకలకు దూరంగా ఉండాలని చెబుతూ ఈ కరోనా కష్ట సమయంలో వీలైతే తోటి వారికి సహాయం చేయాలని వివరణ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లి సెలబ్రేషన్స్ చేసుకోవద్దని మీరు జాగ్రత్తగా ఉండి ఇంట్లో వాళ్ళను జాగ్రత్తగా ఉంచాలని కోరాడు.

ముందుగా RRR
ఇక వేడుకలు లేకపోయినా కూడా బుధవారం తారక్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులకు బ్యాక్ టూ బ్యాక్ కానుకలు రాబోతున్నాయి. తారక్ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ అప్డేట్స్ రాబోతున్న విషయం తెలిసిందే. ముందుగా RRR కు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ రాబోతోంది.

ఈసారి టీజర్ కాకుండా..
ఇదివరకే RRR నుంచి కొమురం భీమ్ టీజర్ రాగా ఇప్పుడు మాత్రం కేవలం ఒక హై వోల్టేజ్ లుక్కుతో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. బుధవారం ఉదయం 10గంటలకు సినిమాకు ఇంటెన్స్ కొమురం భీమ్ లుక్కును విడుదల చేయనున్నారు.

NTR 31 అప్డేట్..
ఇక KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేస్తున్న తారక్ ఆ సినిమాకి సంబంధించిన స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది. ఇక RRR అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన విశేషాలు కొన్ని తెలియజేయనున్నారు. వేడుకలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రేపు తారక్ హవా గట్టిగానే కొనసాగుతుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











