జూ ఎన్టీఆర్ -బోయపాటి సినిమాపై డౌట్స్ క్లియర్ చేసిన వల్లభ..!
జూ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో క్రియేటివ్స్ కమర్షియల్స్ బ్యానర్ పై అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రం మూడో షెడ్యుల్ షూటింగ్ జూలై ఒకటి నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇంతవరకు పదమూడు రోజుల షూటింగ్ జరిగిందని దర్శకుడు బోయపాటి చెప్పారు. జూ ఎన్టీఆర్, శృతి హాసన్ లపై రొమాంటిక్ సీన్లు; జూ ఎన్టీఆర్, రాహుల్ దేవ్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్; జూ ఎన్టీఆర్, కోట, బ్రహ్మానందం, అలీ లపై కామెడీ సీన్లు చిత్రీకరించినట్టు ఆయన తెలిపారు. జూ ఎన్టీఆర్ తో చేయడం చాలా హ్యాపీగా ఉందనీ, అలాగే క్రియేటివ్ కమర్షియల్స్ వంటి పెద్ద సంస్థలో చేయడం కూడా సంతోషాన్నిస్తోందని దర్శకుడు చెప్పారు. జూ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉంటాయన్నారు.
నిర్మాత వల్లభ మాట్లాతూ, జూ ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ లో నిర్మించడం ఆనందాన్నిస్తోందనీ, ఇది జూ ఎన్టీఆర్ మాత్రమే చేయగల సబ్జెక్ట్ అనీ అన్నారు. జూలై 11 వరకు మూడో షెడ్యులు వుంటుంది. ఆగష్టులో 15 రోజుల షూటింగు జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 12 నుంచి 80 రోజుల పాటు చివరి షెడ్యులు ఉంటుందని నిర్మాత చెప్పారు. ఏది ఏమైనా నవంబర్ ఎండింగ్ కు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూ ఎన్టీఆర్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.యస్.రామారావు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











